For Good Luck bring Tulasi Plant to Home in New Year 2023: మరికొన్ని రోజుల్లో 2022 ముగిసి.. కొత్త సంవత్సరం 2023 రాబోతోంది. నూతన సంవత్సరం గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండాలని సాధారణంగా అందరూ కోరుకుంటారు. 2022లో చాలా నెలలు కరోనా వైరస్ మహమ్మారి భయంతో ప్రజలు గడిపారు. అందుకే ప్రతి ఒక్కరూ కరోనా కాలంలో చూసిన సమస్యలను రాబోయే సంవత్సరంలో ఎదుర్కోకూడదని బలంగా కోరుకుంటున్నారు. మీరు 2023 సంవత్సరంలో ప్రశాంతంగా గడపాలని, ఆర్ధిక పరిస్థితి మెరుగవ్వాలని కోరుకుంటే.. ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది. వాస్తు నిపుణుల ప్రకారం ఆ పని ఏంటో తెలుసుకుందాం.
శంఖం:
హిందూ మతంలో 'శంఖం' చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శంఖాన్ని విష్ణువు తన చేతుల్లో పట్టుకున్నాడని హిందూ శాస్రం చెబుతోంది. అందుకే శంఖం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందట. శంఖం ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ తొలగించడంతో.. డబ్బుకు లోటు ఉండదు. కాబట్టి కొత్త ఏడాది రోజున ఓ శంఖంను మీ ఇంటికి తీసుకెళ్లండి.
వినాయకుడి విగ్రహం:
హిందూ మతంలో ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు గణేశుడిని పూజిస్తారు. వినాయకుడి అనుగ్రహం పొందిన వారికి సుఖ సంతోషాలకు లోటు ఉండదని నమ్ముతారు. అందుకే కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఇంట్లో చిన్నపాటి వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోండి. దీనివల్ల మీకు శుభం కలుగుతుంది.
తులసి మొక్క:
ఆయుర్వేదంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అంతేకాదు హిందూ మతపరంగా చాలా పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో తప్పకుండా ఇంట్లోకి తులసి మొక్కను తెచ్చి పూజించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో అంతా శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఇలా ఉన్నాయి!
Also Read: Donation Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకూడదు.. చేశారో మీ అదృష్టం దురదృష్టంగా మారుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.