clove Astro tips: డబ్బుల సమస్యలతో చింతిస్తున్నారా..?.. లవంగాలతో ఇలా చేస్తే ఆకస్మిక ధనలాభం..

clove Astro tips: మనలో చాలా మంది ఎంత కష్టపడినకూడా డబ్బులు అస్సలు మిగలవు. నెల తిరక్కుండానే డబ్బులన్ని ఖాళీ అయిపోతుంటాయి. ఇలాంటి వారు లవంగాలతో ఇలా చేస్తే జీవితంలో గొప్పయోగాలు సంభవిస్తాయి.   

Last Updated : May 2, 2024, 10:31 PM IST
  • లవంగాలతో కళ్లు చెదిరే లాభాలు..
  • లాకర్ లో, వర్క్ ప్లేస్ లో పెట్టుకుంటే ఊహించని ప్రయోజనాలు..
clove Astro tips: డబ్బుల సమస్యలతో చింతిస్తున్నారా..?.. లవంగాలతో ఇలా చేస్తే ఆకస్మిక ధనలాభం..

Astrology Benefits of cloves: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక మనిషి జీవితంలో ఎదుర్కొనే ప్రతిసమస్యలకు కూడా పరిష్కారం ఉంటుంది. మనిషి తన జీవితంలో ఎక్కువగా ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కానీ కొన్ని రెమిడీలు పాటిస్తే జీవితంలోనే అన్నిరకాల ఇబ్బందుల నుంచి ఈజీగా బైటపడోచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో లవంగాల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. దీనికి కొన్ని దివ్యమైన గుణాలున్నాయని కూడా చెబుతుంటారు. 

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

లవంగం ప్రయోగాలు.. 

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు లవంగాలతో ఈ ప్రయోజం చేస్తే అనేక లాభాలు కల్గుతాయి. ప్రతిరోజు ఇంట్లో నుంచి ఆఫీసుకు వెళ్లేటప్పుడు తమ పర్సులో లవంగంను తప్పకుండా పెట్టుకొవాలి. ఇది పాజిటివ్ గుణాన్ని కల్గిఉంటుంది. అంతేకాకుండా నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. మనం డబ్బులు పెట్టే బీరువాలోని లాకర్ లో లవంగం ను పెట్టాలి. లవంగంను, మనం ఆఫీసులో పని ప్రదేశంలో పెట్టుకుంటే, చెడుగా ఆలోచనలుచేసేవారు, మనకు చెడును కల్గచేయాలని భావించే వారికి ఇది విరుగుడుగా పనిచేస్తుంది. లవంగంను కొందరు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే లవంగంను ఇంట్లో జాగ్రత్తగా బీరువాలో పెట్టుకొవాలి. ప్రతిరోజు లవంగంను ప్యాంటులో నుంచి తీసేసి, కొత్తది లవంగంను పెట్టుకొవాలి. ఇంట్లో లవంగంను ఒక ఆర్తికర్పూరం మీద వేసి, దాన్ని వెలిగించాలి. అప్పుడు వచ్చే పొగతో ఇంట్లో కాసేపు ఉండచాలి. దీంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా మాయమైపోతుంది.

కిచెన్ లో లవంగం లాభాలు..

వంట గదిలో లవంగం వల్ల అనేక లాభాలు కల్గుతాయి. లవంగం ను బిర్యానీల తయారీలో తప్పుకుండా ఉపయోగిస్తారు. లవంగం వేయకుంటే బిర్యానీ టెస్ట్ అస్సలు బాగుండదంటూ కూడా చెప్తారు. లవంగంను టీలో వేసుకుని తాగితే, దగ్గు, గొంతుపట్టడం, గొంతునొప్పివంటి సమస్యలన్ని దూరమైపోతాయి. లవంగంను రాత్రిపూట ఒక గ్లాసులో వేసుకుని ఉదయం తాగితే జీర్ణక్రియ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. బొద్దింకలు, చీమలు, కీలకాలు ఉన్న ప్రదేశంలో లవంగాలను వేస్తే దాన్నుంచి వచ్చే ఘాటైన వాసనకు కీటకాలు, బొద్దింకాలు దూరంగా పారిపోతాయి. 

లవంగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

కొందరు తరచుగా గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చిన్న పిల్లలలో ముఖ్యంగా ఇమ్యునిటీ తక్కువగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. ఇలాంటి వారు లవంగాలను నీళ్లలో నానబెట్టి లేదా పెస్ట్ లాగా చేసి తినిపిస్తే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. లవంగాల పెస్ట్ ను ముఖంపై అప్లై చేస్తే మొటిమలు , బ్లాక్ హెడ్స్ లు తగ్గిపోతుంటాయి. చేతులపై అవాంఛీత రోమాలు దూరమైపోతాయి. జీర్ణక్రియ సమస్యలు ఉండవు.

Read More: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

లవంగాలను నీళ్లలో నాన బెట్టి ఆ నీళ్లతో స్నానంచేస్తే శరీరంలో నుంచి దుర్వాసన కల్గించే క్రిములు అన్ని నాశనమైపోతాయి. ఈ విధంగా లవంగం ఇటు ఆస్ట్రాలజీ ప్రకారంగాను, ఆరోగ్యపరంగా కూడా ఉపయోగ పడుతుంది.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News