Yamudu Puja tips: ఈరోజు జూన్ 23 గురువారం. ఇవాళ విష్ణువు మరియు దేవగురువు బృహస్పతిని పూజించాలని నియమం ఉంది. అలాంటప్పుడు ఈరోజు యముడిని పూజించాల్సిన అవసరం ఏముంది? వాస్తవానికి, పంచాంగం ఆధారంగా చూస్తే.. ఈరోజు ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలో పదవ రోజు. దశమి తిథికి ప్రతినిధి మృత్యుదేవత అయిన యముడు. ఈరోజు యముడిని (Yamudu) పూజించడం వల్ల మృత్యుభయం తొలగిపోతుంది. అయితే యముడి పూజా విధానం గురించి తెలుసుకుందాం.
ఆషాఢ దశమి తేదీ 2022 ముహూర్తం
ఆషాఢ కృష్ణ దశమి తిథి జూన్ 22వ తేదీ రాత్రి 08:45 గంటలకు ప్రారంభమై... జూన్ 23వ తేదీ రాత్రి 09.41 గంటల వరకు ఉంటుంది. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంది.
యముడిని ఎలా పూజించాలి?
యముడిని ఈ రోజు సాయంత్రం పూజిస్తారు. దీని కోసం, పిండితో చేసిన దీపం వెలిగిస్తారు. యమరాజుకు సాయంత్రం పూట యమ దీపం లేదా జామ దీపం వెలిగిస్తారు. స్కాంద పురాణంలో యముడి పూజ ప్రాముఖ్యత గురించి చెప్పబడింది.
యముడి పూజా విధానం
ప్రదోషకాలంలో ఈరోజు సాయంత్రం పసుపు కలిపిన పిండితో దీపం చేయాలి. అందులో రెండు పొడవాటి కాటన్ ఒత్తులు వేయాలి. అందులో నువ్వుల నూనె నింపి అందులో కొన్ని నల్ల నువ్వులు వేయాలి.ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించండి. అక్షత, చందనం, నీరు మొదలైన వాటితో ఆయనను పూజించండి. ఇప్పుడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణ దిశకు అభిముఖంగా ఉండి ధర్మరాజు యమరాజుకు నమస్కరించాలి. వారిని పూజించి ఆ దీపాన్ని దక్షిణ దిక్కున అమర్చండి. ఈ విధంగా యముడిని పూజించడం వల్ల మృత్యుభయం తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. యముడి అనుగ్రహం వల్ల మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు లభిస్తుంది.
Also Read: Mars Transit 2022: కుజ సంచారం.. జూన్ 30 లోపు ఈ 4 రాశుల వారిపై డబ్బు వర్షం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.