Grah Gochar 2023: 48 గంటల తర్వాత సంచరించనున్న రెండు పెద్ద గ్రహాలు.. ఈ రాశుల వారికి బంగారు రోజులు మొదలు!

Aries, Cancer and Leo zodiac signs have golden days due to Mars and Mercury Transit 2023. బుధుడు, కుజుడు గ్రహాల రాశి మారడం వల్ల మేషం, కర్కాటకం, సింహ రాశుల వారికి విశేష ప్రయోజనాలు అందుతాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 10, 2023, 03:21 PM IST
  • 48 గంటల తర్వాత సంచరించనున్న రెండు పెద్ద గ్రహాలు
  • ఈ రాశుల వారికి బంగారు రోజులు మొదలు
  • ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది
Grah Gochar 2023: 48 గంటల తర్వాత సంచరించనున్న రెండు పెద్ద గ్రహాలు.. ఈ రాశుల వారికి బంగారు రోజులు మొదలు!

After 48 Hours golden days starts to These 3 zodiac signs due to Mars and Mercury Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. 2023 జనవరిలో పెద్ద గ్రహాలు సంచరించబోతున్నాయి. జనవరి 13న వృషభ రాశిలోకి కుజుడు పరివర్తనం చెందబోతున్నాడు. ధనుస్సు రాశిలోకి గ్రహాల రాకుమారుడు బుధుడు ఉదయిస్తాడు. ఈ గ్రహాల మార్పు అన్ని రాశుల వారి జీవితంపై శుభ మరియు అశుభ ప్రభావం చూపిస్తుంది. కుజుడు, బుధుడు గ్రహాల మార్పు కారణంగా ఈ రాశుల వారికి విశేష ప్రయోజనాలను పొందుతారు.

జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. 2023 జనవరి 13న మధ్యాహ్నం 12:07 గంటలకు వృషభ రాశిలో కుజుడు పరివర్తన చెందుతాడు. మరోవైపు ఉదయం 5.15 గంటలకు ధనుస్సు రాశిలో బుధుడు ఉదయిస్తాడు. ఈ రెండు గ్రహాల రాశి మారడం వల్ల మేషం, కర్కాటకం, సింహ రాశుల వారికి విశేష ప్రయోజనాలు అందుతాయి. ఈ మూడు ఈ రాశుల వారికి మరో 48 గంటల తర్వాత బంగారు రోజులు మొదలు అవుతాయి. 

మేష రాశి:
కుజుడు, బుధుడు గ్రహాల మార్పు మేష రాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. గతంలో వివాదంలో చిక్కుకున్న ప్రజలు ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో మెరుగుదల ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. ఊహించని డబ్బు మీ సొంతం కానుంది. 

కర్కాటక రాశి:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రెండు గ్రహాల మార్పు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది. కార్యాలయంలో ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనేక అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం శుభప్రదం. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకున్న విద్యార్థులు విజయం సాధిస్తారు.

సింహ రాశి: 
సింహ రాశి వారు కుజుడు మరియు బుధ గ్రహాల సంచారం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్టాక్ మార్కెట్ మొదలైన వాటితో సంబంధం ఉన్న వారికి మెరుగుదల ఉంటుంది. ఆఫీసులో సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సహోద్యోగులు, ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. తల్లితో మీ సంబంధం మెరుగుపడుతుంది.

Also Read: Tata Cars Offers 2023: టాటా కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా 75,000 తగ్గింపు! లిమిటెడ్ ఆఫర్ 

Also Read: IND vs SL: టీమిండియాదే బ్యాటింగ్.. ఇషాన్‌, సూర్యకు దక్కని చోటు! తుది జట్టు ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News