2023 Horoscope zodiac signs : వచ్చే ఏడాదిలో ఈ రాశుల వారే లక్కీ.. డబ్బు, పెళ్లి విషయాల్లో తిరుగులేదు

2023 Horoscope zodiac signs 2023 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అదృష్టం వెంటాడుతుందట. ధన లాభదాయకం, ప్రేమ జీవితం, కెరీర్‌లో ఉన్నతి వంటివి చేకూరుతాయట.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2022, 12:56 PM IST
  • వచ్చే ఏడాది ఎలా ఉండబోతోందంటే?
  • మూడు రాశుల వారే లక్కీ పర్సన్స్
  • తులా, మిథునం, వృశ్చికం వారి జాతకం ఇదే
2023 Horoscope zodiac signs : వచ్చే ఏడాదిలో ఈ రాశుల వారే లక్కీ.. డబ్బు, పెళ్లి విషయాల్లో తిరుగులేదు

2023 Horoscope zodiac signs : ప్రతీ ఏడాది బాగుండాలని, మంచి జరగాలనే ఆశ, ఉద్దేశ్యం, కోరికతోనే ముందుకు సాగుతుంటారు. అయితే వచ్చే ఏడాది మాత్రం మూడు రాశుల వారికి అదిరిపోయేలా అదృష్టం పట్టుకునేలా కనిపిస్తోంది. ఇంతకీ ఆ మూడు రాశుల వారు ఎవరో.. వారికి ఎలాంటి లాభాలు రాబోతోన్నాయో ఓ సారి చూద్దాం.

కొత్త ఏడాది ప్రారంభం కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2023 సంవత్సరం ఏ రాశుల వారికి శుభం, ఎవరికి అశుభం అని తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలోనూ నెలకొంది. 2023 సంవత్సరంలో గ్రహాలు, రాశుల స్థితిని పరిశీలిస్తే, ఈ సంవత్సరం 3 రాశుల వారికి చాలా మంచిది. వారు కెరీర్‌లో కూడా ప్రయోజనం పొందుతారు. ఆర్థికంంగా కూడా చాలా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు, వ్యాపారంలో చాలా లాభాన్ని పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. 2023 సంవత్సరం ఏ రాశుల వారికి అదృష్టాన్ని చేకూరుస్తుందో తెలుసుకుందాం.

మిథున రాశిపై ప్రభావం..
మిథున రాశి వారికి వచ్చే ఏడాది లాభదాయకంగానే ఉంటోంది. అత్యంత అదృష్ట సంవత్సరాలలో ఒకటిగా ఉంటుంది. ఈ సంవత్సరం లక్ష్యాలను సాధిస్తారు. ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందాలనే మీ కల నెరవేరుతుంది. ఉన్నత పదవిని పొందిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. పెళ్లి విషయం ఖాయం. మీ భాగస్వామితో హాయిగా ఉండగలరు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది.

తులారాశి ప్రభావం.. అంతా మంచే జరుగుతుంది.
2023 సంవత్సరం తులారాశి వారికి వృత్తి, ప్రేమ , డబ్బు పరంగా అంతా మంచే జరుగుతుంది. కొత్త అవకాశాలను పొందుతారు. కెరీర్‌లో ముందుకు సాగుతారు. గొప్ప విజయాలు సాధిస్తారు. పెద్ద కల నెరవేరుతుంది. కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండండి, ఇది మీ పని నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

వృశ్చికంపై ప్రభావం..
ఏడాది పొడవునా బిజీగా ఉన్నప్పటికీ కెరీర్‌లో అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. అవి చాలా ప్రయోజనాలను ఇస్తాయి. పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. పదోన్నతి  జీతం పెరిగే పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఒంటరి వ్యక్తులు భాగస్వామిని పొందవచ్చు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది.

( గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read : Krishna Passed Away: ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ షేక్.. వరుసగా 12 సినిమాలు ఫ్లాప్  

Also Read : Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. బాధపడాల్సిన అవసరం లేదన్న వర్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News