Video: వేగంగా దూసుకొచ్చి యువకుడిని కుమ్మబోయిన గొర్రె.. ఏం జరిగిందో చూడండి..

Viral Video of a man fun with Sheep: తనను కుమ్మేందుకు వేగంగా దూసుకొస్తున్న గొర్రె నుంచి ఓ యువకుడు ఎలా తప్పించుకున్నాడో ఈ వీడియోలో చూడండి.. ఒకటి కాదు  రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు దాని దాడి నుంచి తప్పించుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 12:37 AM IST
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన షీప్ వీడియో
  • యువకుడిని తలతో కుమ్మేందుకు యత్నించిన గొర్రె
  • మూడుసార్లు దాని దాడి నుంచి తప్పించుకున్న యువకుడు
Video: వేగంగా దూసుకొచ్చి యువకుడిని కుమ్మబోయిన గొర్రె.. ఏం జరిగిందో చూడండి..

Viral Video of a man fun with Sheep: సోషల్ మీడియాలో నిత్యం లెక్కలేనన్ని వీడియోలు (Viral Videos) అప్‌లోడ్ అవుతుంటాయి. ఇందులో ఫన్నీ వీడియోలు చాలామందిని ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటిదే ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోను గమనిస్తే.. తలతో తనను కుమ్మేందుకు వస్తున్న గొర్రె (Sheep) నుంచి ఓ యువకుడు తప్పించుకోవడం గమనించవచ్చు. ఏం చేశాడో తెలియదు కానీ... ఆ గొర్రె అతని వైపు వేగంగా దూసుకొచ్చి కుమ్మేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో మూడుసార్లు అతను.. గొర్రె పైనుంచి దూకి తప్పించుకున్నాడు. చివరకు ఓ పెద్ద బండరాయి పక్కకు చేరి నిలుచుండిపోయాడు. 

Hepgul5 అనే ఇన్‌స్టా యూజర్ ఖాతా ద్వారా కొద్దిరోజుల క్రితం అప్‌లోడ్ అయిన ఈ వీడియో... ప్రస్తుతం వైరల్‌గా (Viral Video) మారింది. ఇప్పటివరకూ 5,64,312 మంది నెటిజన్లు దీన్ని వీక్షించారు.  ఈ వీడియోను చూస్తుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నామని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. మరికొందరు నెటిజన్లు.. అతను రిస్కీ ఫీట్ చేశాడని.. ఒకవేళ గొర్రె అతన్ని కుమ్మి ఉంటే పరిస్థితేంటని ప్రశ్నించారు. అదే కొమ్ములు ఉన్న గొర్రెతో అయితే.. ఇలాంటి ఫీట్స్ ఎవరూ చేయలేరని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కామెంట్ల సంగతెలా ఉన్నా.. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by hepgul5 😊 (@hepgul5)

Also Read: Ind Vs WI: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News