Bull stops Cricket Match: ఎద్దు వల్ల ఆగిన క్రికెట్ మ్యాచ్.. వైరల్ అవుతున్న వీడియో..

Bull stops play: క్రికెట్ మ్యాచ్‌లు వర్షం వల్లఆగిపోవడం చూసుంటాం. కానీ ఎద్దు వల్ల మ్యాచ్ రద్దు అవ్వడం ఇదే మెుదటిసారేమో. తాజాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.   

Written by - Samala Srinivas | Last Updated : Feb 20, 2024, 06:23 PM IST
Bull stops Cricket Match: ఎద్దు వల్ల ఆగిన క్రికెట్ మ్యాచ్.. వైరల్ అవుతున్న వీడియో..

Bull stops Cricket Match: మన ఊళ్లలో ఆవులు, గేదెలు స్వేచ్చగా సంచరిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చి హల్ చల్ చేస్తుంటాయి. వీటి వల్ల ఆస్తి, ప్రాణం నష్టం కూడా జరుగుతుంది. అప్పుడప్పుడు సరాదా ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. ఈ కోవకు చెందినదే తాజా ఘటన. సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌ల‌ు వర్షం అంతరాయం కలిగించడం వల్ల ఆగిపోతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ ఎద్దు మ్యాచ్ ను ఆపేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

వీడియో ఓపెన్ చేస్తే.. కొందరు కుర్రాళ్లు మైదానంలో క్రికెట్ ఆడుతుంటారు. దూరం నుంచి కొందరు మ్యాచ్ ను తిలకిస్తూ ఉంటారు. అయితే ఇంతలో అనుహ్య ఘటన చోటుచేసుకుంటుంది. రెండు ఎద్దులు క్రికెట్ ఆడే ఫ్లేస్ కు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఒక ఎద్దు అక్కడి నుంచి వెళ్లిపోగా.. రెండో ఎద్దు నిలబడి క్రికెట్ ఆడుతున్న వారిని చూసి వారిపై దూసుకెళ్తోంది. ఆటగాళ్లు దాన్ని ఎంత బెదిరించినా బెదరదు. దాంతో వారికి ఏం చేయాలో తెలియక తలో దిక్కుకు పరిగెడతారు. అయితే ఆ ఎద్దు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అతడి వెనుకే దౌడు తీస్తుంది. ఆ యువకుడు దానికి చిక్కకుండా తప్పించుకుంటాడు. మ్యాచ్ చూడటానికి వచ్చిన వారందరూ పగలబడి నవ్వుకున్నారు. 

Also Read: Viral Video today: వాటర్ బాటిల్ ఎత్తుకెళ్లిన పెద్దపులి.. వైరల్ అవుతున్న వీడియో..

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. దీనిపై లైక్స్, కామెంట్లు వర్షం కురుస్తోంది. ‘‘ఈ ఎద్దుకు క్రికెట్ మ్యాచ్ అంటే ఇష్టం లేదేమో’’.. అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఇది నిజంగా గేమ్ ఛేంజరేనని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు 9 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. 

Also Read: Viral video today: వామ్మో.. హెయిర్ కటింగ్ ఇలా కూడా చేస్తారా?.. వైరల్ అవుతున్న వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News