Viral Video today: మన భాష నేర్చుకోవాలంటే తెల్లోడికి చాలా కాలం పడుతోంది. అదే వాళ్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకు నెలరోజులు చాలు. అలాంటి ఇంగ్లీష్ ను మన దేశంలో బాగా చదువుకున్నవారే మాట్లాడతారనే అపోహ ఉంది. కానీ అది తప్పు అని నిరూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్ కు ఫిదా అయ్యాడు ఫారినర్. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.
వీడియో ఓపెన్ చేస్తే.. యూకేకు చెందిన ఓ వ్యక్తి ఏటీఎమ్ కోసం వెతుకుతూ దారిలో కనిపించిన ఆటో డ్రైవర్‌తో మాటలు కలుపుతాడు. ఫారినర్ ఏటీఎం ఎక్కడ అని ఇంగ్లీష్‌లో అడుగుతాడు. దానికి జవాబుగా దగ్గర్లో రెండు ఏటీఎంలు ఉన్నాయని.. అందులో ఒకటి పనిచేయడం లేదని ఆటో డ్రైవర్ అద్బుతంగా ఆంగ్లంలో చెప్తాడు. అంతేకాకుండా అతడిని ఆటోలో కూర్చోపెట్టుకుని మరో ఏటీఎం దగ్గరకు తీసుకెళ్తాడు. ఆటో డ్రైవర్ ఆనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు విదేశీయుడు. ఈ వీడియోను కేరళలోని కోచిలో షూట్ చేసినట్లు ఉన్నారు. ఈ వీడియోలో ఉన్న ఆటో డ్రైవర్ పేరు ఆష్రఫ్ గా తెలుస్తోంది. .
బ్రిటన్ కు చెందిన వ్లాగర్ zakkyzuu ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై కామెంట్స్, లైక్స్ వర్షం కురుస్తోంది. దీనిని ఇప్పటివరకు కోటి మందికిపైగా వీక్షించగా.. దాదాపు 6 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్ తాము కూడా ఫిదా అయినట్లు చెప్తున్నారు.
Also Read: Viral Video today: ఈ బుజ్జి ఏనుగుకు ముందే వచ్చేసిన హోలీ.. ఎలా ఆడుతుందో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook