Viral Video: ఆసుపత్రి ఐసీయూలో రచ్చ, కుక్కకరిచిన మేకకు మెరుగైన చిక్సిత అందించాలని యజమాని డిమాండ్‌!

Goat Owner Viral Video: భోజ్ పూర్‌కు చెందిన ఓ మేక యజమానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 17, 2023, 11:13 AM IST
Viral Video: ఆసుపత్రి ఐసీయూలో రచ్చ, కుక్కకరిచిన మేకకు మెరుగైన చిక్సిత అందించాలని యజమాని డిమాండ్‌!

Goat Owner Viral Video: ఒక్క సారి మూగ జీవులతో బంధం ఏర్పడిందంటే అది జీవితాంతం ప్రేమగానే ఉంటుంది. అవి ఉన్న లేకున్న వాటితో గడిపిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనలో చాలా మంది పిల్లి, మేక, కుక్కలను ఎంతో ప్రేమగా పెంచుకోవడం తరచుగా చూస్తూ ఉంటాం. వాటిని వదిలి పెట్టి ఎక్కడికి వెళ్లరు..ఒక వేళా వెళ్లాల్సి వస్తే వాటిని వెంట పెట్టుకుని వెళ్తారు. అంతేకాకుండా ఆ జంతువులు కూడా తమ యజమానులపై తమదైన శైలిలో ప్రేమ చూపిస్తాయి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులైతే ఎప్పుత యజమాని చుట్టూ తిరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కొన్ని అనుకోని సంఘటన కారణంగా వాటికి ఏమైన జరిగితే తట్టుకోలేకపోతారు. అయితే ఇలాంటి సంఘటనే ఓ యజమానికి ఎదురయ్యింది. ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. 

ఓ వ్యక్తి ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న మేకను ఓ పిచ్చి కుక్క కరిచింది. దీంతో ఆ మేత తీవ్ర వ్యాధి బారిన పడింది. అయితే యజమాని మేక బాధ తాళలేక స్థానికంగా ఉన్న జనరల్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. ఆ యజమాని అక్కడితో ఆగకుంగా వేగంగా  ఎమర్జెన్సీ వార్డుకు ఆ మేకను తీసుకెళ్లి, అదిపడుతున్న బాధ గురించి తెలియజేస్తాడు. దీంతో అక్కడున్న డాక్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా అక్కడ ఉన్న డాక్టర్స్‌ తన అమాయకాన్ని చూడడం మొదలు పెట్టారు. అంతేకాకుండా చాలా సేపు ఆ యజమాని మేక గురించి వివరించాడు. అంతేకాకుండా కుక్క కొరికన ప్రదేశాన్ని కూడా వారికి చూపించాడు. 

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

అంతేకాకుండా రూ. లక్ష ఖర్చైనా ఏం పర్వలేదని, మేక మాత్ర ఎప్పటి లాగా కోలుకుని తీరగాలని డాక్టర్లను ఆ అమయాకు యజమాని వేడుకున్నాడు. అయితే ఈ యజమాని ప్రేమను ఆర్థం చేసుకున్న డాక్టర్లు అతన్ని వెటర్నరీ హాస్పిటల్‌కి తీసుకెళ్లమని సూచిస్తారు. అయితే యజమానికి చదువు రాకపోవడం వల్ల కాసేపు మొండిగా డాక్టర్లతో వాదనకు దిగాడు. దీంతో హాస్పిటల్‌ సిబ్బంది గుంపు చేరుకున్నారు. చివరకు స్థానికులు ఆ యజమానికి పూర్తిగా వివరించి వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లేలా చేశారు. 
 

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News