Man vs Apes Viral Video: మందుబాబుకు చుక్కలు చూపించిన కొండముచ్చులు.. వైరల్ వీడియో

Man vs Apes Viral Video: కొండముచ్చులకు చిప్స్ ప్యాకెట్ ఇవ్వడానికి అతడు నిరాకరించడంతో ఓ కొండముచ్చుకి కోపం కట్టలు తెంచుకుంది. నాకే నో చెబుతావా అన్నట్టు సినిమాల్లో హీరోలా అమాంతం గాల్లోకి ఎగిరి అతడి జుట్టు లాగి నేలకొసే కొట్టింది. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 09:43 AM IST
Man vs Apes Viral Video: మందుబాబుకు చుక్కలు చూపించిన కొండముచ్చులు.. వైరల్ వీడియో

Man vs Apes Viral Video: కోతులు, కొండముచ్చులతో సావాసం ఎంత ప్రమాదకరమో తెలుసా ? తెలియకపోతే ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఇతడిని అడగండి చెబుతాడు. ఇతడికి మాత్రం ఎలా తెలుసంటారా ? ఏదైనా అనుభవం లోకి వస్తే కానీ తెలియదంటారు కదా.. ఇది కూడా అలాంటిదే. చుట్టూ కొండముచ్చులు.. మధ్యలో అతడొక్కడే వాటికి చిక్కాడు. పైగా చుట్టూ ఉన్న కొండముచ్చులను టెంప్ట్ చేసేలా అతడి చేతిలో ఆలు చిప్స్ ప్యాకెట్ కూడా ఉంది. 

మనిషి ఒక్కడిగా దొరికితే ఒక ఆటాడుకోనిదే కోతులైనా, కొండెంగలైనా విడిచిపెట్టవు.. అలాంటిది అతడి చేతిలో చిప్స్ ప్యాకెట్ కూడా ఉండటంతో ఇక వాటి ఆనందానికి అవధుల్లేవనుకోండి. దొరికాడే భక్రా అన్నట్టు ఒకదానినొకటి చూసుకుని పండగ చేసుకుందాం అనుకున్నాయి. కానీ అతడే వాటికి సహకరించలేదు. అతడి దగ్గరున్న చిప్స్ ప్యాకెట్ కోసం అవి ట్రై చేస్తే.. ససేమిరా ఇచ్చేది లేదన్నట్టు ఫోజు కొట్టాడు. ఇంకేం.. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🇮🇳Rabindra Parida 🇮🇳 (@parida20208)

 

కొండముచ్చులకు చిప్స్ ప్యాకెట్ ఇవ్వడానికి అతడు నిరాకరించడంతో ఓ కొండముచ్చుకి కోపం కట్టలు తెంచుకుంది. నాకే నో చెబుతావా అన్నట్టు సినిమాల్లో హీరోలా అమాంతం గాల్లోకి ఎగిరి అతడి జుట్టు లాగి నేలకొసే కొట్టింది. ఆ తర్వాత చిప్స్ ప్యాకెట్లోంచి ఆలు చిప్స్ కిందపడటంతో అతడి పక్కనే కూర్చుని తినడం మొదలుపెట్టాయి. కొండముచ్చు ఒక్కటిచ్చాకా దాని దెబ్బ ఎలా ఉంటుందో అతడికి కూడా తెలిసొచ్చినట్టుంది కాబోలు.. ఆ తర్వాత వాటిని ఏమీ అనకుండా వాటితో కలిసి చిప్స్ తింటూ కూర్చున్నాడు. అయితే ఇక్కడ అతడి ధైర్యానికి మరో కారణం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. అందుకే అంత ధైర్యంగా వాటితో తగవు పెట్టుకున్నాడు. అంతేకాకుండా చుట్టూ కొండముచ్చులు ఉన్నా.. మధ్యలో కూర్చుని వాటి కంపెనీ ఎంజాయ్ చేస్తున్నాడు.

Trending News