Rs 500 Note Turns to Rs 2000 Note: అరే.. రూ. 500 నోటును 2 వేల నోటుగా బలే మారిందే.. మీరు కూడా ట్రై చేయండి!

Making Rs 500 Note as Rs 2000 Note: రూ. 500 నోటును పెట్టుబడిగా పెట్టి రూ. 2,000 సంపాదించవచ్చా ? మీ వద్ద ఉన్న రూ. 500 నోటును రూ. 2 వేల నోటుగా చేయవచ్చా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే అసలు విషయం ఏంటో మీకే అర్థం అవుతుంది. 

Written by - Pavan | Last Updated : Apr 12, 2023, 07:18 PM IST
Rs 500 Note Turns to Rs 2000 Note: అరే.. రూ. 500 నోటును 2 వేల నోటుగా బలే మారిందే.. మీరు కూడా ట్రై చేయండి!

Making Rs 500 Note as Rs 2000 Note Try this: సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఆసక్తికరమైన వింతలు, విశేషాలతో కూడిన వీడియోలు ఉంటే.. ఇంకొన్ని విజ్ఞానం అందించే నాలెడ్జ్ షేరింగ్ వీడియోలు ఉంటాయి. ఇవే కాకుండా ఇంకెన్నో రకాల టైమ్‌పాస్ వీడియోలు కూడా కనిపిస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ మూడో రకమైన టైమ్‌పాస్ వీడియోలకే నెటిజెన్స్ నుంచి ఆధరణ ఎక్కువగా ఉంటుంది. 

నెటిజెన్స్ నుంచి ఎక్కువ ఆధరణ లభిస్తున్న నేపథ్యంలో డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా అలాంటి వీడియోలు రూపొందించేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో కొన్ని వాళ్లలో వాళ్లే ఆటపట్టించే ప్రాంక్ వీడియోలు కాగా.. ఇంకొన్ని వీడియోలు చూసే జనాన్ని ఆటపట్టించేవి ఉంటాయి. ఇప్పుడు చూడబోయే ఈ వీడియో కూడా అలా వీడియో చూసే నెటిజెన్స్‌ని ఆటపట్టించే రకానికి చెందినదే. 

పరోటా చేసే ఒక మహిళ ఆ పరోటా మడతల మధ్య రూ. 500 నోటు పెట్టి పరోటా చేసింది. ఆ పరోటాను పేనంపై కాల్చింది. పరోటాను తీసి చూస్తే అందులో 2 వేల రూపాయల నోటు కనిపించింది. అది చూసి ఆశ్చర్యపోవడం జనం వంతవుతోంది. జనాన్ని ఆటపట్టించేందుకు ఎవరో ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

ఈ వీడియో చూసి ఇందులో ఉన్న విషయం నిజమే అనుకుంటే పొరపాటే. నిజంగా 500 రూపాయల నోటును 2,000 నోటుగా మార్చే మ్యాజిక్ ఏదీ ఇంకా పుట్టలేదు. ఒకవేళ అలా చేసినా.. అది బతుకుదెరువు కోసం నలుగురిని ఆకట్టుకునేందుకు చేసే ఇంద్రజాలం అవుతుంది తప్ప అందులో నిజం ఉండదు. సో ఈ వీడియో చూసి.. ఇందులో ఉన్నట్టుగానే 500 నోటును మడత చపాతీలోనో లేక పరోటాలోనో పెట్టి చూసేరు.. అలా చేస్తే అది రూ. 2 వేల నోటు కాకపోగా.. మీరు పెట్టిన 500 రూపాయల నోటు కూడా మీకు పనికిరాకుండా పోతుంది. 

ఈ వైరల్ వీడియో కూడా వీక్షించండి: Tea Seller Washing Tea Cup Toilet With Toilet: టీ కప్‌లో మూత్రం పోసిన ఛాయ్ వాలా.. వీడియో వైరల్

ఈ వీడియోను మీరు సరిగ్గా గమనిస్తే.. 500 రూపాయల నోటును అందులో పెట్టిన తరువాత అనేకసార్లు వీడియోలో బ్రేక్స్ ఉంటాయి. అంటే అది సింగిల్ టేక్ వీడియో కాదు. మధ్యలో రూ. 500 నోటును పెట్టిన తరువాత కెమెరా ఆఫ్ చేసి ఆ నోటును బయటపెట్టి.. మళ్లీ పరోటా చేయడం పూర్తయిన తరువాత మడతల మధ్యలో రూ. 2000 నోటును పెట్టి షూట్ చేసిన వీడియో అది. లేదంటే మధ్యలో నోటును పెట్టి పరోటా చేయడం సాధ్యపడదు.. ఒకవేళ అలా చేసిన ఆ నోటు పేనం వేడికి, ఆవిరికి చిరిగిపోతుందే తప్ప.. మరొక నోటుగా రూపాంతరం చెందదు. అంటే ఒక్కముక్కలో చెప్పాలంటే.. పైసా ప్రయోజనం లేని మీ పనికిరాని ప్రయోగం విలువ రూ. 500 నష్టాన్ని తీసుకొస్తుంది. ఇప్పటికే అసలు విషయం అర్థమైంది అనుకుంటా. ఇలాంటి వైరల్ వీడియోలు సరదాగా చూసి నవ్వుకునేందుకు, నలుగురిని ఆటపట్టించేంత వరకే తప్ప అంతకంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకోవద్దు అనే విషయం మర్చిపోకూడదు.

ఈ వైరల్ వీడియో కూడా వీక్షించండి: Skateboarder Falls Under Bike: నడిరోడ్డుపై స్కేట్ బోర్డింగ్.. నేరుగా వెళ్లి బైక్ కింద.. OMG వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News