Tiger Attacks Circus Trainer: సర్కస్‌లో ఎదురు తిరిగిన పెద్ద పులి.. ఒళ్లు గగుర్పొడిచే రియల్ వీడియో

Tiger Attacks Circus Trainer: పులులు లాంటి కృూరమృగాలతో డీల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అవి అడవిలో జంతువులను వేటాడి కడుపు నింపుకునే అతి కృూరమృగాలు కనుక. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అనుకుంటున్నారా ? అయితే ఇదిగో ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో చూడండి.. అసలు సంగతి ఏంటో మీకే అర్థమవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 01:38 AM IST
Tiger Attacks Circus Trainer: సర్కస్‌లో ఎదురు తిరిగిన పెద్ద పులి.. ఒళ్లు గగుర్పొడిచే రియల్ వీడియో

Tiger Attacks Circus Trainer: సర్కస్‌లో పులులు, ఏనుగులతో ఆటలాడించడం, వాటితో కలిసి సరదా సరదా జిమ్మిక్కులు చేయడం మీరూ చూసే ఉంటారు. ఒకవిధంగా సర్కస్ ట్రైనర్స్‌కి అది కత్తి మీద సాములాంటి వృత్తే. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నచందంగా ఉంటుంది ఆ పని. ఎందుకంటే సర్కస్ చేసే సమయంలో పులులతో, ఏనుగులతో చాలా ఓపిగ్గా, జాగ్రత్తగా వాటిని మచ్చిక చేసుకుని మరీ రంగంలోకి దిగాలి. అయినా సరే కొన్నిసార్లు జంతువులు ఎప్పుడు, ఎందుకు, ఎలా రియాక్ట్ అవుతాయో ఊహించడం కష్టమే. అవి కానీ చెప్పినట్టు వినకుండా ఎదురుతిరిగాయంటే.. వాళ్లకు భూమ్మీద నూకలు కరువైనట్టే అనుకోవాలి. 

మరీ ముఖ్యంగా పులులు లాంటి కృూరమృగాలతో డీల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అవి సాధు జంతువులు కాదు.. అడవిలో జంతువులను వేటాడి కడుపు నింపుకునే అతి కృూరమృగాలు కనుక. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? అయితే ఇదిగో ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో చూడండి.. అసలు సంగతి ఏంటో మీకే అర్థమవుతుంది. 

 

చూశారు కదా.. సర్కస్ ట్రైనర్ రెండు పులులతో సర్కస్ చేస్తుండగా మధ్యలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ట్రైనర్ ఒక పులితో సర్కస్ చేస్తుండగానే.. ఆ వెనకాలే నిల్చున్న మరో పులి వచ్చి అతడిపై దాడిచేసి గాయపర్చింది. అతడు తప్పించుకునే అవకాశం లేకుండా కాలు పట్టి లాగింది. పులి దాడిలో అతడి మెడ, కాలుకి పులి దంతాల గాట్లు దిగి బలమైన గాయాలయ్యాయి. ఇటాలియన్ ప్రావిన్స్ లోని లెస్సిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పులి దాడిలో గాయపడిన అతడి పేరు ఇవాన్ ఓర్ఫి. సర్కస్ ట్రైనర్ పై పులి దాడి చేయడం చూసి ఆడియెన్స్ అంతా షాకయ్యారు. అరుపులు, కేకలతో సర్కస్ ఏరియా మార్మోగిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు.

పులి ఇవాన్ ఓర్ఫిపై దాడి చేయడం చూసిన అతడి అసిస్టెంట్.. అక్కడే ఉన్న టేబుల్ సాయంతో ఆ పులిపై దాడి అది అతడిని విడిచిపెట్టేలా చేశాడు. పులి దాడి నుంచి ఎలాగోలా బయటపడిన ఇవాన్ ని సర్కస్ నిర్వాహకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పులి దాడిలో అతడు తీవ్రంగా గాయపడినప్పటికీ.. అతడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

Trending News