Play Pool Game: పూల్ గేమ్ ఇలా కూడా ఆడుతారా ?.. ఫన్నీ వీడియో

Play Pool Game: విలువైన వస్తువులు లేకున్నా.. తృప్తికరంగా ఎలా ఉండొచ్చొ తెలుసా? అలాంటి విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పే ఓ వైరల్ వీడియో మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 04:12 PM IST
  • పూల్​ గేమ్​ ఫన్నీ వీడియో
  • చూసేందుకు ఫన్నీగా ఉన్నా గుడ్​ మెసేడ్​
  • ట్విట్టట్​లో షేర్ చేసిన ఐఐఎస్​ అధికారి
Play Pool Game: పూల్ గేమ్ ఇలా కూడా ఆడుతారా ?.. ఫన్నీ వీడియో

Play Pool Game: పూల్​ గేమ్​ ఎప్పుడైనా ఆడారా? చాలా మందికి ఈ గేమ్​ గురించి ఎక్కువగా తెలిసి ఉండదు. కొందరికి తెలిసినా అది బాగా రిచ్​ పీపుల్ మాత్రమే ఆడే గేమ్​గా భావిస్తుంటారు.

స్నూకర్​ గేమ్​లాంటిదే ఈ పూల్​ గేమ్​ కూడా. కాకపోతే.. సైజులో స్నూకర్​ టేబుల్ కన్నా చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఈ గేమ్​ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే.. ఇంటర్నెట్​లో ఈ గేమ్​కు సంబంధించి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఏముందంటే..

పూల్​ గేమ్​ టేబుల్ కొనాలంటే చాలా ఖర్చుతో కూడకున్న పని.. అందుకే ఓ బుడ్డోడు తన స్నేహితులతో కలిసి అలాంటి గేమ్​ను తనకు అందబాటులో ఉన్న వస్తువులతో సులభంగా తయారు చేసుకున్నాడు.

ఇటుక రాళ్లను వరుసగా పెట్టి.. ఓ కర్రా రంగు రంగు బంతులతో పూల్​ గేమ్​ టేబుల్​ను సిద్ధం చేసి అడుకున్నారు. ఇక్కడ ఫన్నీ విషయం ఏమిటంటే.. అందులో ఓ బుడ్డోడు టేబుల్​లోపలికి వెళ్లి మరీ గేమ్ ఆడాడు. ఈ వీడియో చూసేందుకు చాలా ఫన్నీగా ఉందంటున్నారంతా.

నిజానికి ఇదో 2018లో వచ్చింది. అయితే ఆ వీడియోను ఐఐఎస్​ (ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్​) అంకూర్ లహోతి ఇటీవల షేర్ చేశారు.

ఆ వీడియోకు 'సంతోషంగా ఉండేవాళ్లతో అన్ని ఉత్తమైనవే ఉండవు.. వాళ్లే ప్రతీ విషయాన్ని ఉత్తమంగా మార్చుకుంటారు' అని క్యాప్షన్ పెట్టారు.

ఈ వీడియో చూసిన చాలా మంది.. 'నిజమే కదా మనకు కావాల్సిన దానిని ఎంత విలువైంది అనేది కాకుండా.. దాని పట్ల మనం ఎంత సంతృప్తిగా ఉన్నాం అనేదే ముఖ్యం.' అంటున్నారు మరికొంత మంది. మరీ ఆ వీడియోను మీరు చూసేయండి ఇప్పుడే. చూసేందుకు ఫన్నీగా ఉన్నా ఈ వీడియోలో గొప్ప సందేశం కూడా ఉందంటున్నారు మరికొందరు.

Also read: Woman Taste Indian food: ఈ మాడ్రిడ్‌ అమ్మాయికి ఇండియా ఫుడ్‌ తెగ నచ్చేసింది, అబ్బా ఏమన్నా టేస్టా అంటోన్న యువతి!

Also read: Monkey Hilarious Reaction: కోతి ముందు వ్యక్తి మ్యాజిక్... అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన మంకీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News