Viral news: తాపీ మేస్త్రీ ఉద్యోగానికి ప్రకటన ఇచ్చిన అమెరికా కాన్సులేట్.. జీతం తెలిస్తే షాక్ అవుతారు..

Viral news in Telugu: హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్ లో తాపీమేస్త్రీ ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజైంది. దీనికి నోటిఫికేషన్ ఇవ్వడమే ఆశ్చర్యం కలిగిస్తే.. జీతం అంతకంటే ఎక్కువ అవాక్కయ్యేలా చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 01:40 PM IST
Viral news: తాపీ మేస్త్రీ ఉద్యోగానికి ప్రకటన ఇచ్చిన అమెరికా కాన్సులేట్.. జీతం తెలిస్తే షాక్ అవుతారు..

US Consulate Jobs: తాపీమేస్త్రీ ఉద్యోగానికి హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా ఈ జాబ్ కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ కూడా ప్రకటించింది. దీంతో ఈ న్యూస్ అందరి దృష్టిని ఆకర్షించింది. 

కళ్లు చెదిరే జీతం

హైదరాబాద్‌లోని అమెరికా కాన్యులేట్ జనరల్ కార్యాలయంలో తాపీమేస్త్రీ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో వార్షిక వేతనం రూ.4,47,348గా పేర్కొన్నారు.అంటే నెలకు రూ.37,279 అన్న మాట. జీతంతోపాటు అదనపు  ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇది పుల్ టైమ్ జాబ్. ఎవరైనా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది పర్మినెంట్ జాబ్ కూడా. అయితే ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైనా వ్యక్తి 40 గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. బ్యాక్‌ గ్రౌండ్ వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత 4 నుంచి 8 వారాల్లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది.

అర్హతలు ఇవే..
తాపీ పనిలో కనీసం రెండేళ్లు అనుభవం ఉన్నవారు ఈ జాబ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరికి కాంక్రీట్‌ మిక్చర్‌లలో రకాలు, రకరకాల ఇటుకలతో నిర్మాణం, ఫ్లోరింగ్ పనులు, మార్బుల్ ఫ్లోరింగ్‌, హాలో బ్రిక్స్, రాతి కట్టడాల నిర్మాణంలో అనుభవం ఉండాలి. తాపీమేస్త్రీ ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. అప్లై చేసుకుకే అభ్యర్థి కనీసం 8వ తరగతి చదివి ఉండాలి. అంతేకాకుండా ఇంగ్లీష్‌ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ‌్యర్థులు మెడికల్ టెస్టులో పాస్ అవ్వాల్సి ఉంటుంది. 

Also Read: Viral Video today: చిన్నారి పాపను ఎంతో ప్రేమగా లాలించిన ఆవు.. హృదయాన్ని హత్తుకుంటున్న వీడియో..

Also Read: Eagle Vs King Cobra Snake Video: పక్షి గుడ్లతో పాటు పిల్లను తిన్న కింగ్ కోబ్రా..చివరికి ఏమైందో మీరే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News