Attack On Fruit Vendor: కొంతమంది పైశాచిక ప్రవర్తనకు ఒక అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సాటిమనిషి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనిషే మనిషిపై అడవి జంతువుల కన్నా హీనంగా దాడికి పాల్పడుతున్న సందర్భాలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా అత్యంత క్రూరంగా, విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ కృూరమృగాల కంటే తామే డేంజర్ అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? ఇదిగో ఇప్పుడు మేం చూపించబోయే ఈ వీడియో చూస్తే.. మీ రక్తం కూడా సలసల మరగడం ఖాయం.
ఒక పండ్ల వ్యాపారిని ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా, విచక్షణారహితంగా కొడుతున్న ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న నొయిడాలో యాపిల్ పండ్లు విక్రయించి పొట్టపోసుకునే ఒక చిరు వ్యాపారిపై తమ ప్రతాపం చూపించారు. కేవలం రూ. 5 డిస్కౌంట్ కోసం ఆ పండ్ల వ్యాపారికి, ఇద్దరు కస్టమర్లకు మధ్య జరిగిన వివాదం దాడికి దారితీసింది.
ఇద్దరు యువకులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో గాయపడిన బాధితుడిని నొయిడాలోని సెక్టార్ 5 లోని హరౌలా మండిలో పండ్ల వ్యాపారం చేసుకునే అజయ్ అనే యువకుడిగా గుర్తించారు. సోమవారం అమిత్ అనే వినియోగదారుడు అజయ్ పండ్ల బండి వద్దకు వచ్చి యాపిల్ ధర ఎంత అని అడిగాడు. అందుకు అజయ్ స్పందిస్తూ.. కిలో ధర 90 రూపాయలు అని చెప్పాడు. అయితే, అమిత్ మాత్రం కిలో రూ.85కే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఆ వివాదం కాస్తా పెద్ద ఘర్షణకు దారి తీసింది. దీంతో అమిత్ తన స్నేహితుడితో కలిసి అజయ్ పై పిడిగుద్దులు కురిపిస్తూ దారుణంగా దాడికి పాల్పడ్డాడు.
Fruit vendor brutally thrashed! Alleged Reason: He didn't agree for Rs 5 discount in Apples.
माल में जाकर कोई 1 पैसे का डिस्काउंट नहीं मांगता। लेकिन, गरीब फल वाला अगर डिस्काउंट न दे तो हमारा EGO Hurt हो जाता है। पता नहीं #Noida-GZB-Delhi ही ऐसे है, या पूरी दुनिया ही ऐसी है| pic.twitter.com/0SEmzvNoow
— Aman Dwivedi (@amandwivedi48) January 18, 2023
ఒక వ్యక్తి జోక్యం చేసుకుని పండ్ల వ్యాపారిపై దాడిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ.. అమిత్, అతడి స్నేహితుడు ఇద్దరూ అతడి మాట వినిపించుకోలేదు. మధ్యలో అడ్డం రావొద్దంటూ ఆ వ్యక్తిని బెదిరించి మరీ అజయ్ పై దాడికి పాల్పడ్డారు. మండిలోని మరో కస్టమర్ ఈ ఉదంతం మొత్తాన్ని వీడియో తీయడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఫేజ్-1 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుల్లో అమిత్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అమిత్ స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.