Thirsty Monkey Video: వానరానికి దాహార్తి తీర్చిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు ఫిదా!

Thirsty Monkey Video: ముంబయి - అహ్మదాబాద్ మార్గంలో హృదయాన్ని హత్తుకునే ఘటన జరిగింది. ఓ ట్రాఫిక్ పోలీస్ ఓ వానరానికి దాహార్తిని తీర్చాడు. తీవ్ర దాహంతో ఉన్న వానరానికి ఆ పోలీస్ స్వయంగా మంచినీళ్లు తాగించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 01:23 PM IST
Thirsty Monkey Video: వానరానికి దాహార్తి తీర్చిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు ఫిదా!

Thirsty Monkey Video: ఈ ఏడాది ఎండలు కొద్దిగా ముందుగానే వచ్చాయి. మార్చి నెల నుంచే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల ధాటికి మనుషులే కాకుండా.. జంతువులు కూడా తాళలేకపోతున్నాయి. అడవిలో ఉండే జంతువులు కూడా మంచినీటి కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎండల ధాటిని తట్టుకోలేని ఓ వానరం మంచినీటి కోసం వెతుకుతుండగా.. ఓ పోలీస్ ఆ వానరానికి స్వయంగా మంచినీటిని తాగించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వీడియోలో ఏముంది?

ముంబయి - అహ్మదాబాద్ హైవేలో మల్షేజ్ ఘాట్ వద్ద కొందరు ట్రాఫిక్ పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. అంతలో అటుగా ఓ వానరం మంచినీటి కోసం వెతుకులాట ప్రారంభించింది. దాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆ వానరానికి స్వయంగా మంచినీళ్లు తాగించాడు. ఓ బాటిల్ లో మంచినీళ్లు పట్టి దగ్గరుండి నీటిని తాగించగా.. తీవ్ర దాహంతో ఉన్న వానరం ఏకంగా బాటిల్ మంచినీటిని తాగేసింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay)

మనసుకు హత్తుకునే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్ట్రీట్‌డాగ్‌సాఫ్ బాంబే అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ వీడియోను షేర్ చేసింది. వానరం దాహార్తి తీర్చిన ట్రాఫిక్ పోలీస్ కు నెటిజన్లు సలాం కొడుతున్నారు. ఎంతటి దాహంతో ఉంటేనో అన్ని నీళ్లు తాగిందని ఆ వీడియో చూసిన వారంతా అనుకుంటున్నారు.  

Also Read: Viral Video: షాకింగ్ వీడియో.. కేవలం 3 సెకన్లలో కుప్పకూలిపోయిన భవనం!

Also Read: Viral Video: నడిరోడ్డులో యువతిని కొట్టుకుంటూ వెళ్లిన ఫుడ్ డెలివరీ బాయ్.. వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News