Free Condoms On Valentine's Day: వాలెంటైన్స్ డే.. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం.. ప్రేమికుల కోసమే అంకితం చేసిన దినోత్సవం ఇది. అందుకే ప్రేమికుల సౌలభ్యం కోసమే అన్నట్టుగా.. ప్రేమికులు ఎంజాయ్ చేయడానికి అన్నట్టుగా ఓ దేశం విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక దేశం తమ దేశవ్యాప్తంగా 95 మిలియన్ల ఉచిత కండోమ్స్ పంపిణి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ దేశం మరేదో కాదు.. పర్యాటకులు స్వర్గధామంగా భావించే థాయిలాండ్. అవును.. థాయిలాండ్ లో వాలెంటైన్స్ డే సందర్భంగా 95 మిలియన్ల కండోమ్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచే థాయిలాండ్ దేశవ్యాప్తంగా ఫ్రీ కండోమ్స్ పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది.
ఇంతకీ ఈ ఫ్రీ కండోమ్స్ ఎందుకు ?
ఒక దేశ ప్రభుత్వం తమ దేశ పౌరులకు ఫ్రీగా కండోమ్స్ పంపిణి చేస్తోందంటే అది జనాభా పెరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్న నిర్ణయం అయి ఉండవచ్చు అనే అనుకుంటారు. కానీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేస్తున్నారంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. ఎక్కడో తేడా కొడుతోంది అనిపిస్తోంది కదూ.. అవును.. మీరు అనుకున్నది నిజమే. కాకపోతే ఇలా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేయడంలో కూడా ప్రజాహితం ఉందంటోంది థాయిలాండ్.
థాయిలాండ్ ప్రభుత్వం చెబుతున్న ప్రజా ప్రయోజనం ఏంటంటే.. వాలెంటైన్స్ డే కంటే ముందుగా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేయడం వల్ల సుఖ వ్యాధులు ( సెక్సువల్లీ ట్రాన్స్మిట్టెడ్ డిసీజెస్ ) వ్యాపించకుండా ఉండటంతో పాటు టీనేజ్ ప్రెగ్నెన్సీని నివారించవచ్చని. టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే మైనర్ గా ఉన్నప్పుడే గర్భం దాల్చడం అన్నమాట. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ 95 మిలియన్ల కండోమ్స్ పంపిణి చేయాలనే లక్ష్యంతో దీనిని ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమంగా భావిస్తూ ఫిబ్రవరి 1 నుంచే కండోమ్స్ పంపిణి చేయడం ప్రారంభించింది.
సుఖ వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు, టీనేజ్ లోనే గర్భం దాల్చే ఘటనలను నివారించేందుకు థాయిలాండ్ తీసుకున్న ఈ నిర్ణయంపై జనం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ప్రజా ప్రయోజనం సంగతి అంటుంచితే.. థాయిలాండ్ ప్రభుత్వం పరోక్షంగా ఏం ప్రోత్సహిస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. అంతే కదా మరి..