Treasure With Snake Video Watch Here: మనం సినిమాల్లో పాములు ధన బాండా గారాలకు రక్షణగా ఉండడం తరచుగా చూస్తూ ఉంటాం. పూరి జగన్నాథ్ ఆలయంలో ఉండే ధనభాండాగారని ఇప్పటికీ పాములు రక్షణగా నిలుస్తున్నాయని మనం వార్తల్లో చూస్తున్నాం. అలాగే గతంలో రాజులు యుద్ధంలో విజయం సాధించినప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన సంపదను దోచుకొని వాటిని ఒక సురక్షితమైన ప్రదేశాలకు తరలించి వాటికి రక్షణగా పాములనే ఉంచేవారట. ఇలాంటి ఎన్నో ఘటనలు చరిత్రలో పేర్కొన్న సంగతి అందరికీ విధితమే.. అయితే ఇవన్నీ కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తున్నాం.. కానీ ఇటీవల వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి సీన్స్ సినిమాల్లో కాకుండా నిజంగా ఉంటాయని ఈ వీడియో ప్రూవ్ చేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో? పూర్తి వివరాలం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన పూర్వీకులు ఏదైనా ధనాన్ని పురాతన ఆలయాల దగ్గరనో.. లేదా ఇంటి పక్కనే ఖాళీ ప్రదేశంలోనూ ఒక గొయ్యి గా రవి పాతి పెట్టేవారు. ఆ తర్వాత అందులో ఉన్న బంగారం డబ్బు మిగతా తరాల వారికి ఏదో ఒక రూపంలో అందేది. అయితే రాజులు సంపాదించిన ఆస్తులు కూడా ఇలానే కొన్ని నిర్మానుష్య ప్రదేశంలో ఉంచేవారట. వీటికి కాపలాగా భారీ కింగ్ కోబ్రాలను, ఎన్నో రకాల ప్రమాదకరమైన పాములను తీసుకువచ్చి అక్కడ వదిలేవారుట. ఇవి ధనానికి రక్షణగా నిలిచేవని కొన్ని బుక్స్ లో రాశారు. అయితే ఇటీవల వైరల్ అవుతున్నావు వీడియో కూడా దీనికి సరి సమానంగా ఉందని చెప్పవచ్చు. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తికి తన పూర్వీకులకు సంబంధించిన చిన్నపాటి నిధి ఉండడం గమనించి అది ఉన్నచోట త్రవ్వకాలు జరుగుతాడు.
ఇలా ఆ నిధి ఉన్నచోట త్రవ్వకాలు జరిపి అందులో నుంచి ఓ బంగారు రంగులోని చెంబు బయటకి తీస్తాడు. అంతేకాకుండా ఆ చెంబులో ఉన్న నగలను తీసే క్రమంలో వింత అనుభవం ఎదురవుతుంది. అయితే అందులో నుంచి నగలతో పాటు ఒక పాము కూడా బయటికి రావడం గమనిస్తాడు. అందులో ఉన్న పాము నెమ్మదిగా బయటికి వస్తుంది. దీంతో ఆ వ్యక్తి ముందుగానే గమనించి పామును ఒక కట్టెతో నగల నుంచి వేరు చేస్తాడు. అయితే ఈ క్రమంలో ఆ పాము వ్యక్తిపై దాడి చేయకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. కావాలని ఈ వ్యక్తి ఆ చెంబులు పామును ముంచి నగలను పాతి పెట్టాడని.. సోషల్ మీడియాలో వ్యూస్ రావడానికి కోసమే ఇలా చేశాడని కొంతమంది నెటిజన్స్ అంటున్నారు.
మరికొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే.. ఈ వీడియోని చూసి దుమ్మెత్తి పోస్తున్నారు. వ్యూస్ కోసం ప్రస్తుతం జనాలు ఎలాంటి వీడియోలైనా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారడానికి కారణం ఇదే వీడియోనని కొంతమంది చెబుతున్నారు. నిజానికి ఏది ఏమైనా ఇలా సోషల్ మీడియా స్టంట్ కోసం వీడియోలు చేయడం అంత మంచిది కాదు. అయితే ఈ వీడియోను @tasbehansanjuwad అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది లైక్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.