Shocking Price of Single Potato Chip: సాధారణంగా ఒక చిన్న సైజు చిప్స్ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది. బింగో, లేస్, హల్దీరామ్... ఇలా ఏ బ్రాండ్ తీసుకున్నా రూ.10కి మించదు. కాస్త పెద్ద సైజు అయితే రూ.50 వరకు ఉండొచ్చు. కానీ కేవలం సింగిల్ పీస్ చిప్‌ను అమ్మడం మీరెక్కడైనా చూశారా.. ఈకామర్స్ దిగ్గజం 'ఈబే'లో ఓ వ్యక్తి ఒకే ఒక్క చిప్ పీస్‌ను అమ్మకానికి పెట్టాడు. పైగా దాని ధర అక్షరాలా 1 లక్షా 63 వేలు కావడం గమనార్హం.
ఇంగ్లాండ్‌లోని బకింగ్హామ్షైర్కి చెందిన ఓ వ్యాపారి ఈ చిప్స్ ప్యాకెట్‌ను ఈబేలో మే 3న ఈ చిప్ పీస్‌ను అమ్మకానికి పెట్టాడు. దీని ధర 2వేల యూరోలుగా పేర్కొన్నారు. అంటే.. మన కరెన్సీలో రూ.1.63 లక్షలు. పుల్లటి క్రీమ్, ఆనియన్ ఫ్లేవర్‌తో ఈ చిప్‌ను తయారుచేసినట్లు డిస్క్రిప్షన్లో పేర్కొన్నారు. దీని షేప్ చాలా ప్రత్యేకమైనదని... పైన ఒక అరుదైన మడత ఉంటుందని.. ఇదొక సరికొత్త ప్రొడక్ట్ అని పేర్కొన్నారు. ఎంత అరుదైన ప్రత్యేకత ఉన్నా... మరీ ఇంత ధరేంటని దీని గురించి తెలిసినవారు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇలా సింగిల్ చిప్ పీస్‌ను అమ్మాలన్న ఆలోచన ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతున్నారు.
ఇలా తిను బండారాలను భారీ ధరకు ఆన్లైన్లో విక్రయానికి పెట్టడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఓ వ్యక్తి ఇలాగే కేవలం టూ పీస్ చిప్స్‌ను 50 యూరోలకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో విక్రయానికి పెట్టాడు. ఇటీవల మెక్ డొనాల్డ్‌కి చెందిన చికెన్ నగ్గెట్‌పై ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహించగా ఓ వ్యక్తి ఏకంగా రూ.73 లక్షలకు కొనుగోలు చేశాడు. దీని షేప్‌కి ఉన్న ప్రత్యేకత కారణంగానే అంత భారీ ధరకు అమ్ముడైనట్లు మెక్‌డొనాల్డ్స్ తెలిపింది. పొలిన్జ అనే అమెరికాకు చెందిన వ్యక్తి దీన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొంది.
Also Read: Samantha Hot Selfie: హాట్ హాట్‌గా సమంత... ఒంటిపై కేవలం బాత్ టవల్‌తో సెల్ఫీ పోజు...
Also Read: Tibet Airlines Fire: చైనాలో విమాన ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విమానం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook