దుమారంరేపుతున్న వర్మ ట్విట్టర్ ఫొటోలు

Last Updated : Oct 18, 2017, 10:18 AM IST
దుమారంరేపుతున్న వర్మ ట్విట్టర్ ఫొటోలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై రోజుకో ఆసకికరమైన కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో తాజాగా వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటోలు సంచలనంగా మారాయి.  సీఎం చంద్రబాబు నాయుడు సినిమా పై విమర్శలొద్దు అని చెప్పి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో..  వర్మ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ఎక్కడికి దారితీస్తాయో తెలియటం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఫోటోలపై ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారనుంది. 

ఎన్టీఆర్ ఆత్మ నిత్యమూ కలలోకి వస్తోందని, స్క్రిప్ట్ సహకారం కూడా ఆయనదేన‌ని రాంగోపాల్  వర్మ కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఆయన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కానీ కొద్దిసేపటిక్రితం ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వ‌తి, చంద్రబాబు నాయుడు ఉన్న రెండు ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు వర్మ.  స్వర్గీయ ఎన్టీఆర్ లక్ష్మీపార్వ‌తి మెడ‌లో పూలమాల వేస్తున్న ఫోటో ఒకటి, మరొకటిది ఎన్టీఆర్ క‌న్నుమూసిన‌ప్ప‌టిది. ఈ రెండు ఫోటోలలో చంద్రబాబు నాయుడు కనిపిస్తారు. కానీ, ఓ అభిమాని పోస్టర్ ను చేసిందని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. మీరూ చూడండి.

 

 

Trending News