Pregnant Delivery in Train: రైలులోనే నిండు గర్భిణికి నొప్పులు.. సమయస్పూర్తి చూపిన మహిళలు

Pregnant Delivery in Train: యాంకర్ అసలే నిండు గర్భిణి. దానికి తోడు సమయానికి చేతిలో చిల్లి గవ్వలేని ప్రయాణం. అంతలోనే ప్రసవ నొప్పులు రావడంతో ప్రయాణిస్తున్న రైలులోని తోటి మహిళా ప్రయాణికులు స్పందించి సకాలానికి ప్రసవం చేయడంతో ఆ తల్లి బిడ్డలు ఇద్దరూ ఈ గండం నుండి క్షేమంగా బయటపడ్డారు.

Written by - Pavan | Last Updated : Aug 21, 2023, 08:27 AM IST
Pregnant Delivery in Train: రైలులోనే నిండు గర్భిణికి నొప్పులు.. సమయస్పూర్తి చూపిన మహిళలు

Pregnant Delivery in Train: యాంకర్ అసలే నిండు గర్భిణి. దానికి తోడు సమయానికి చేతిలో చిల్లి గవ్వలేని ప్రయాణం. అంతలోనే ప్రసవ నొప్పులు రావడంతో ప్రయాణిస్తున్న రైలులోని తోటి మహిళా ప్రయాణికులు స్పందించి సకాలానికి ప్రసవం చేయడంతో ఆ తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్ పరిధిలో రైలులో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..  ఓ నిండు గర్భిణీకి రైలు ప్రయాణంలో ఉండగానే నొప్పులు వచ్చాయి. ఆ గర్భిణి ప్రసవ నొప్పులను భరించలేక ఇబ్బంది పడుతుండటం గమనించిన తోటి మహిళా ప్రయాణికులే ఆమె పాలిట వైద్యులు అయ్యారు. ఆ బోగీలో ఉన్న మహిళలు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఆ గర్భిణికి సహాయం చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. 

ఆ మహిళల పుణ్యమా అని వారి సహాయంతో ఆ నిండు గర్భిణి రైలులోనే ప్రసవించింది. గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మహిళలు సకాలంలో స్పందించి సమయస్పూర్తి ప్రదర్శించడంతో తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఈ గండం నుండి బయటపడ్డారు. 

గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన మహమూద బేగం తన కూతురు ఆర్సియా అభస్సుం (24) నిండు గర్భిణితో పాటు మనవరాలు మూడేళ్ల రూమెస్సా కలిసి తమ బంధువులను చూడడానికి గద్వాల నుండి మహబూబ్ నగర్‌కు తుంగభద్ర ట్రైన్లో బయలుదేరారు. కాగా మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకోగానే తాము వచ్చింది మహబూబ్ నగర్ కాదని పొరబడి మరోసారి అదే ట్రైన్ ఎక్కారు. దీంతో ట్రైన్ ఎక్కిన కాసేపటికి తన కూతురు ఆర్సియా అభసుంకు ప్రసవ నొప్పులు రావడంతో తన కూతురికి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో తల్లి మెహమూదాబేగం అక్కడే ఉన్న మహిళా ప్రయాణికులకు విషయం చెప్పి తనకు సహాయం చేయాల్సిందిగా కోరారు. దీంతో మహమూద బేగం పరిస్థితిని మానవతా దృక్పథంతో స్పందించి అర్థం చేసుకున్న తోటి మహిళలు.. జడ్చర్ల సమీపంలోకి రాగానే ట్రైన్‌లో ఉన్న మహిళలు తమతో పాటు ఉన్న గుడ్డలను అడ్డుకట్టి  కూతురు మహమూద బేగం కూతురు ఆసియా అభస్సుమ్ ప్రసవం చేశారు. 

ఇది కూడా చదవండి : Cats & Hen Viral Video: కోడి పిల్లలను పెంచుకుంటున్న పిల్లి.. ఆ సీన్ చూసి షాకైన తల్లి కోడి

ఆ మహిళలు సకాలంలో స్పందించడం వల్లే తన బిడ్డకు సురక్షితంగా ప్రసవం జరిగింది అని చెబుతూ మహమూద బేగం వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణిని, ఆ పసి కందును స్థానికులు 108 సహాయంతో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మరోవైపు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో స్థానిక పోలీసులు, స్థానికులు స్పందించి వారికి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాగా ఆసుపత్రిలో తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి : Snake In Cauliflower: కాలీఫ్లవర్‌‌లో పాము.. ఒళ్లు జలదరించే షాకింగ్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News