Weighing Bride With Golden Bricks: తింటానికి ఒకడు లేక ఏడిస్తే.. తిండి ఎక్కువై ఇంకొకడు ఏడిచాడట అన్నట్టుగా ఉంది ఈ పాకిస్థానీ బిజినెస్‌మేన్ వ్యవహారం. ఒకవైపు పాకిస్థాన్‌లో ఆర్థికమాంధ్యం ఎక్కువై పేదోళ్లకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి దాపురించింది. ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఓపెన్ మార్కెట్లో, కిరాణ దుకాణాల్లో గోధుమ పిండి కూడా కొనుక్కుని తినలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రేషన్ దుకాణాల వద్ద ఊరు ఊరు అంతా ఒకరిపై మరొకరు అన్నట్టుగా నిలబడి నిత్యావసర సరుకులు తెచ్చుకుంటున్నారు. అనేక సందర్భాల్లో రేషన్ దుకాణాలు, నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాల వద్ద సరుకుల కోసం తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఒకరినొకరు కిందపడేసి కొట్టుకుంటున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పాకిస్థాన్ ప్రభుత్వం సైతం అక్కడి పరిస్థితులపై దాదాపు చేతులెత్తేసింది. అయినా ఇప్పడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? మరేంలేదు.. ఇదిగో ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే అసలు సీన్ ఏంటో మొత్తం మీకే అర్థమైపోతుంది.
మన భారత్‌లో తరహాలోనే పాకిస్థాన్‌లోనూ కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు బంగారం కానుక ఇచ్చే ఆనవాయితీ ఉంది. అలాగే దుబాయ్‌లో ఉంటున్న ఓ పాకిస్థాన్ వ్యాపారవేత్త కూడా తన కూతురికి పెళ్లి చేసి పంపిస్తూ ఇదిగో ఇలా బంగారు ఇటుకలతో తులాభారం వేశాడు. ఆ నవ వధువుకు సరిసమానంగా 70 కిలోల బంగారంతో తులా భారం వేసి ఆ బంగారం మొత్తాన్ని కూతురికి బహుమతిగా ఇచ్చేశాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో ఇప్పుుడు ఈ బిజినేస్‌మేన్ వ్యవహారం ఓ హాట్ టాపిక్ అయింది. ఓవైపు సొంత దేశమైన పాకిస్థాన్‌లో అన్నమో రామచంద్ర అని నిరుపేదలు ఆకలి చావులు చస్తుంటే... దుబాయ్‌లో రాజభోగాలు అనుభవిస్తూ సొంత దేశం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఇలా కూతురికి 70 కిలోల బంగారు ఇటుకలతో తులాభారం వేసి నీ బలుపు చాటుకుంటావా అంటూ పాకిస్థానీ నెటిజెన్స్ మండిపడుతున్నారు. " ఒకవేళ నిజంగానే కూతురికి బంగారంతో తులాభారం వేయించేంత ఐశ్వర్యం, ధనం ఉంటే.. పాకిస్థాన్‌లో నిత్యం ఎంతోమంది నిరుపేదలు ఆకలి చావులు చస్తున్నారు. వాళ్ల ఆకలిని తీర్చి వారి ఆకలి చావులను నివారించ వచ్చు కదా " అని హితవు పలుకుతున్నారు.
ఇది కూడా చదవండి : Tomato Thulabharam Video: టమాటాలతో తులాభారం వీడియో వైరల్
ఈ బిజినెస్‌మేన్ ఎవరు, ఏంటి అనే వివరాలు బయటికి రాలేదు కానీ.. తన తండ్రిపై వస్తోన్న ట్రోల్స్‌కి అతడి కూతురైన ఆ నవ వధువు ఆయేషా తాహీర్ స్పందించినట్టు తెలుస్తోంది. " ఆ బంగారు ఇటుకలు అచ్చమైన బంగారంతో చేసినవు కాదు " అని ఆయేషా తాహీర్ వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఇదంతా తన తండ్రిపై వస్తోన్న విమర్శలను సైడ్ లైన్ చేయడానికే అలా చెప్పిందా లేక అవి నిజంగానే బంగారం ఇటుకలు కావా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు.
ఇది కూడా చదవండి : Desi Girl Steamy Hot Dance: ఈ లేడీ పిల్ల హాట్ డాన్స్ చూసి నెటిజెన్స్ ఫిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి