Viral Video: కొత్త జంటపై స్టేజ్‌పైనే ఫ్రాంక్ చేసిన దోస్తులు.. మ్యాంగో జ్యూస్‌లో ఏకంగా..! జాతిరత్నాలు సామీ మీరు

Friends prank bride and groom. దోస్తులు తనకు జ్యూస్ తీసుకొచ్చారనుకుని ఆనందపడిన వరుడు.. విస్కీని తాగేస్తాడు. దాని టేస్ట్ అదోలా ఉండేసరికి అతడు వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. ఆపై అదే జ్యూస్‌ను వధువుకు కూడా తాగిస్తారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 09:46 PM IST
Viral Video: కొత్త జంటపై స్టేజ్‌పైనే ఫ్రాంక్ చేసిన దోస్తులు.. మ్యాంగో జ్యూస్‌లో ఏకంగా..! జాతిరత్నాలు సామీ మీరు

New Wedding Couple drinking whiskey on the stage: ఈ రోజుల్లో పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. కొత్త కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతూ.. సరికొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు. ఏదేమైనా పెళ్లిలో అన్ని హంగులు ఉంటాయి. ప్రేమ, అనుబంధం, ఆప్యాయత, అల్లరి.. ఇలా అన్ని ఉంటాయి. ముఖ్యంగా వధూవరుల స్నేహితులు చేసే చిలిపి పనులు హైలెట్ అవుతుంటాయి. వేదికపైనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును వారు సరదాగా ఆటపట్టిస్తుంటారు.  అయితే ఒక్కోసారి ఆ అల్లరి శృతిమించుతుంటుంది. ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. 

తాజాగా ఒక పెళ్లిలో పెళ్లి కొడుకు స్నేహితులు చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరు స్నేహితులు గ్లాస్‌లోని విస్కీని సిరంజీలో నింపి.. దాన్ని మ్యాంగో జ్యూస్ డబ్బాలో కలుపుతారు. అది తీసుకెళ్లి వధూవరులకు ఇచ్చి వారి చేత తాగిస్తారు. దోస్తులు తనకు జ్యూస్ తీసుకొచ్చారనుకుని ఆనందపడిన వరుడు.. విస్కీని తాగేస్తాడు. దాని టేస్ట్ అదోలా ఉండేసరికి అతడు వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. ఆపై అదే జ్యూస్‌ను వధువుకు కూడా తాగిస్తారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wedding Special By SRISHTI (@brides_special)

ఇందుకు సంబందించిన వీడియోను 'brides_special' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ తన ఖాతాలో అప్‌లోడ్ చేసింది. దాంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 80 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 4000లకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాదు కామెంట్ల వర్షం కూడా కురుస్తున్నాయి. 'శుభమా అని ఒక మంచి కార్యం జరుగుతున్న వేళ ఇలాంటి పిచ్చి పనులు ఏంటి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'జాతిరత్నాలు సామీ మీరు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 

ALso Read: Suresh Raina: ఐపీఎల్ 2020 గుర్తుందిగా.. సురేష్ రైనా లేకుంటే చెన్నై పనైపోయినట్టే!

Also Read: Corona Tsunami: బ్రిటన్‌లో కరోనా సునామీ, వారానికి 50 లక్షల కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News