Men Dancing in Sarees: పెళ్లి వేడుకలో చీరల్లో రచ్చరచ్చ.. వీడియో వైరల్

Men Dancing in Sarees: ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసినా.. ఆ పెళ్లి మండపంలో వరుడు, వధువు ఎంత సంతోషంగా ఉన్నారో.. అంతే సంతోషంగా పెళ్లికి వచ్చిన అతిథులు కూడా కాసేపు అంతా మరిచిపోయి తమని తాము మైమరిచిపోయినప్పుడే ఆ పెళ్లిలో ఆనందం వెల్లివిరిస్తుంది. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూడండి.. ఎందుకో మీకే అర్థమవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2023, 10:01 AM IST
Men Dancing in Sarees: పెళ్లి వేడుకలో చీరల్లో రచ్చరచ్చ.. వీడియో వైరల్

Men Dancing in Sarees: భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జీవితంలో ఒక్కసారే వచ్చే పెళ్లి వేడుకని జీవితాంతం గుర్తుండిపోయే వేడుకలా చేసుకోవాలనే ఎవరైనా కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటారు. అన్నింటికిమించి ఎంతో ఖర్చు కూడా పెడతారు. కానీ ఏ పెళ్లి వేడుకైనా సందడిగా ఉండాలంటే ఆ పెళ్లి మండపంలో బంధుమిత్రుల సందడి తప్పనిసరిగా ఉండాల్సిందే. అయినవాళ్ల ఆప్యాయత, స్నేహితుల అల్లరి, చిలిపి చేష్టలు ఏ వేడుకనైనా మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. 

వధూవరుల కళ్లలో ఆనందం కోసమో లేక ప్రెస్టేజ్ సవాల్ కోసమో.. ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసినా.. ఆ పెళ్లి మండపంలో వరుడు, వధువు ఎంత సంతోషంగా ఉన్నారో.. అంతే సంతోషంగా పెళ్లికి వచ్చిన అతిథులు కూడా కాసేపు అంతా మరిచిపోయి తమని తాము మైమరిచిపోయినప్పుడే ఆ పెళ్లిలో ఆనందం వెల్లివిరిస్తుంది. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూడండి.. ఎందుకో మీకే అర్థమవుతుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wedding Choreography By Revati (@weddingchoreographybyrevati)

చూశారు కదా.. ఈ పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్ పెళ్లి కోసం ఎంత త్యాగం చేశారో.. కాసేపు తమ ఐడెంటిటీని పక్కనపెట్టి.. చీరకట్టులో స్టెప్పేసి ఆకట్టుకున్నారు. అది కూడా ఒకటి, రెండు అరకొర స్టెప్పులు కాదు.. అచ్చం అమ్మాయిల్లా వగలుపోతూ, వయ్యారాలు ఒలికిస్తూ అమ్మాయిలను మరిపించేలా డాన్స్ చేసి వధూవరులను మురిపించారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి : King Cobra Viral Video: కింగ్ కోబ్రా.. పడగ విప్పి పైపైకొస్తున్నా.. అతడు మాత్రం కూల్ బేబీ అంటున్నాడు చూడండి

ఇది కూడా చదవండి : Viral Video: కారు క్రాష్ టెస్ట్ ఇలా చేస్తారా ? హై స్పీడ్ యాక్సిడెంట్స్ వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News