Rakhi Festival 2022: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో ఇతడు ఏం పోస్ట్ చేశాడో తెలుసా ?

Raksha Bandhan Post On Tinder: రక్షా బంధన్ పండగకు మరో రెండు రోజులే మిగిలి ఉండటంతో ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎక్కువగా రక్షా బంధన్ వార్తలే కనిపిస్తున్నాయి. అందులో కొన్ని చిత్ర విచిత్రాలు కూడా ఉన్నాయి. అందులోనే ఈ విచిత్రమైన ఘటన కూడా ఒకటి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2022, 07:37 PM IST
Rakhi Festival 2022: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో ఇతడు ఏం పోస్ట్ చేశాడో తెలుసా ?

Raksha Bandhan Post On Tinder: రక్షా బంధన్ పండగకు, ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్‌కి ఏమైనా సంబంధం ఉందా ? ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్‌లో ఎవరైనా ఏం పోస్ట్ చేస్తారు.. లేడీస్ అయితే బాయ్ ఫ్రెండ్స్‌ని ఆకట్టుకునే పోస్టులు.. ఒకవేళ జెంట్స్ అయితే గాళ్ ఫ్రెండ్స్‌ని ఇంప్రెస్ చేసే పోస్టులు కదా పెడతారు!! కానీ ఇదిగో ఈ కుర్రాడు మాత్రం ఫేమస్ ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ టిండర్ యాప్‌లో అందరికీ భిన్నంగా ఓ సరికొత్త పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించుకున్నాడు. అదేంటో చూసేద్దాం పదండి.

నలుగురికి భిన్నంగా ఉండాలనే చేశాడో లేక.. నలుగురి కంట్లో పడటానికే చేశాడో తెలియదు కానీ.. టిండర్ అనే ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో తన ప్రొఫైల్ పోస్ట్ చేసి.. '' రక్షా బంధన్ నాడు తనకు రాఖీ కట్టే సోదరి కోసం వెతుకుతున్నానని.. తనకు రాఖీ కట్టే సోదరితో గిఫ్ట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం కోసం వేచిచూస్తున్నాను'' అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. తన పోస్టుకు స్పందిస్తూ ఇద్దరు సిస్టర్స్ లైక్ కొట్టారని.. ఈ రాఖీ పండగ నాడు వారితో కలిసి రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకోబోతున్నానని ఆ యువకుడు ఆనందం వ్యక్తంచేశాడు. ఆ యువకుడు పెట్టిన పోస్టుకు టిండర్‌లో ఇతర యూజర్స్ కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 

Raksha-Bandhan-2022-greetings-wishes.jpg

టిండర్‌లో గాళ్‌ఫ్రెండ్‌నే కాకుండా సిస్టర్స్‌ని కూడా కనుక్కోవచ్చని ఈ యువకుడు నిరూపిస్తే.. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో అమ్మాయిలనే కాకుండా అద్దె గది కూడా కనుక్కోవచ్చని మరో యువకుడు నిరూపించాడు. కేరళకు చెందిన ఓ యువకుడు ఇటీవల బంబుల్ అనే ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో ఓ పోస్ట్ చేశాడు. ముంబైలో ఉండే వాళ్లు ఎవరైనా ఉంటే.. ముంబైలోని వెస్టెర్న్ లైన్‌కి సమీపంలో తనకు ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ఇల్లు అద్దెకు లభిస్తుందేమో చూసి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. 

కేరళ కుర్రాడి బంబుల్ యాప్ బయోను మరో యూజర్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ఇతడి వ్యవహారం వైరల్ అయింది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ని గాళ్‌ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ కోసమే కాకుండా ఇలా అద్దె ఇల్లు కోసం, సిస్టర్స్ కావాలని ప్రకటనలు ఇవ్వడం కోసం కూడా వాడుకుంటున్నారా అని నెటిజెన్స్ అవాక్కవుతున్నారు. ఏదైనా అంతేకదా మరి.. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అని ఇంకొంత మంది నెటిజెన్స్ (Tricolor Water Viral Video On Social Media) కామెంట్ చేస్తున్నారు. 

Also Read : Raksha Bandhan Gift ideas: రాఖీ పండగకు తక్కువ బడ్జెట్‌లో అక్కా, చెల్లెళ్లకు గిఫ్ట్స్

Also Read : Rakhi and Zodiac Signs: రాశిని బట్టి రాఖీ రంగు.. మీ సోదరుడి రాశిని బట్టే ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News