Push ups stunt video: ఏదో చేయబోయి..మరేదో అయ్యాడట. అందుకే అంటారు వల్లమాలిన పనులు చేయవద్దని. శక్తిమాన్ స్టంట్ చేయబోయి..బొక్క బోర్లా పడ్డాడు. తీవ్రగాయాలతో మంచంపై ఉన్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
థ్రిల్లింగ్, సాహసాలు చేయడం ప్రతిసారీ మంచిది కాదు. కాని పనులు చేసేందుకు ప్రయత్నిస్తే మొదటికే మోసమొస్తుంది. సాహసాలు, థ్లిల్లింగ్ పనులు చేయాలనేవారు సాధారణంగా అందులో ఉన్న ముప్పు గురించి పట్టించుకోరు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే..ఇంకొంతమంది తీవ్రమైన గాయాలపాలవుతున్నారు. డేంజరస్ స్టంట్‌లు చేయవద్దని పోలీసులు పదే పదే చెబుతున్నా పట్టించుకోరు. ఏ మాత్రం చిన్న తప్పిదం లేదా పొరపాటు జరిగినా మూల్యం చెల్లించుకోవల్సివస్తుంది. అటువంటిదే ఈ వీడియో ఇది. బాగా వైరల్ అవుతోంది.
ఇది లక్నోలోని కుక్రైల్ ఫ్లైఓవర్ ప్రాంతం. నడుస్తున్న ట్రక్‌పై ఓ యువకుడు శక్తిమాన్‌లా పుషప్స్ చేయడం మొదలెట్టాడు. అదొక గార్బేజ్ వాహనం కావడంతో బ్యాలెన్స్ లేకుండా అటూ ఇటూ ఊగుతోంది. అయినా పట్టించుకోకుండా ఆవేశంతో పుషప్స్ తీస్తూ..హుషారుగా లేని నిలబడి..పోజులివ్వసాగాడు. ఆ గార్బేజ్ వాహనం జర్క్ ఇవ్వడంతో అదుపు తప్పి కిందకు బొక్ బోర్లాపడ్డాడు. తీవ్ర గాయాలై..మంచాన పడ్డాడు. అదృష్ఠవశాత్తూ ప్రాణాలు దక్కాయి. మరికొన్ని రోజుల వరకూ లేవలేడని తెలుస్తోంది.
गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य-
बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान!
चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ
— Shweta Srivastava (@CopShweta) July 17, 2022
ఈ వీడియోను వెనకున్న ఓ వాహనంలో ఒకరు షూట్ చేయగా..లక్నో అడిషనల్ డిప్యూటీ కమీషనర్ శ్వేతా శ్రీవాస్తవ షేర్ చేశారు. శక్తిమాన్‌లా స్టంట్‌లు చేసేందుకు ప్రయత్నించి మంచం పాలయ్యాడంటూ రాశారు. ఎవరూ దయచేసి ఇలాంటి స్టంట్‌లు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
Also read: Massive Waves Video: పెళ్లి వేడుకపై దూసుకొచ్చేసిన రాకాసి అలలు, కెరటాల్లో కొట్టుకుపోయిన జనం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook