Saving Schemes: మీరు సీనియర్ సిటిజెన్ అయితే...మీ కోసం అద్భుతమైన పధకాలేంటో తెలుసుకోండి

Saving Scheme: సేవింగ్ స్కీమ్స్‌లో చాలా రకాలుంటాయి. సీనియర్ సిటిజెన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించే పథకాలు..మిగిలినవాటితో పోలిస్తే ప్రయోజనాలు అధికం. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్ స్కీమ్స్ ప్రయోజనాలివీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 5, 2022, 06:16 PM IST
Saving Schemes: మీరు సీనియర్ సిటిజెన్ అయితే...మీ కోసం అద్భుతమైన పధకాలేంటో తెలుసుకోండి

Saving Scheme: సేవింగ్ స్కీమ్స్‌లో చాలా రకాలుంటాయి. సీనియర్ సిటిజెన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించే పథకాలు..మిగిలినవాటితో పోలిస్తే ప్రయోజనాలు అధికం. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్ స్కీమ్స్ ప్రయోజనాలివీ..

పోస్టాఫీసులు, బ్యాంకుల్లో చాలా రకాల సేవింగ్స్ ఎక్కౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అన్నింటి కంటే ఎక్కువ ఆదరణ పొందుతోంది మాత్రం సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లే. మీరు సీనియర్ సిటిజెన్ అయితే మాత్రం వెంటనే ఈ స్కీమ్‌లో చేరండి. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజెన్స్ కోసం అమలు చేస్తున్న సేవింగ్స్ స్కీమ్స్‌కు ఆదరణ ఇటీవలికాలంగా పెరుగుతోంది. దీనికి కారణం అతి తక్కువ మొత్తంతో స్కీమ్‌లో చేరడమే కాకుండా ఎప్పుడైనా డిపాజిట్ వెనక్కి తీసుకునే అవకాశముంది. అంతేకాకుండా మిగిలిన పథకాలతో పోలిస్తే అత్యధిక వడ్డీ లభిస్తుంది. గత ఐదేళ్లుగా ఈ స్కీమ్‌లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే దీనికి కారణం. 

సాధారణ సేవింగ్స్ ఎక్కౌంట్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ ఎక్కువ. ఈ పథకంలో జమ చేసే డబ్బుకు 7.40 శాతం వార్షిక వడ్డీ అందిస్తున్నాయి బ్యాంకులు. ఐదేళ్ల కాలం కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మెచ్యూరిటీ పూర్తయిన తరువాత మరో మూడేళ్లకు పొడిగించుకునే అవకాశముంటుంది. 

డిపాజిట్ చేయాల్సింది ఐదేళ్లకాలానికే అయినా...రెండేళ్లలోపు డిపాజిట్ వెనక్కి తీసుకునే అవకాశముంటుంది. అలా వెనక్కి తీసుకుంటే మొత్తం సొమ్ములో 1.5 శాతం మినహాయించుకుని మిగిలిన చెల్లింపులు చేస్తారు. రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్ వెనక్కి తీసుకుంటే మాత్రం 1 శాతం మినహాయించుకుంటారు. బ్యాంకుల్లో వడ్డీ రేటు తగ్గడం, స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఉండటంతో సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకానికి ఆదరణ పెరుగుతోంది. వాస్తవానికి 2018 వరకూ ఈ పథకానికి వార్షిక వడ్డీ రేటు 8.4 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఇది 7.4 శాతానికి తగ్గింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 24 వేల 754 కోట్ల డిపాజిట్లు ఉండగా, 2020-21కు 73 వేల 51 కోట్లకు చేరుకుంది. 

సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ పథకంలో డిపాజిట్ చేయాలంటే 60 ఏళ్లు పైబడి ఉండాలి. ముందస్తుగా వీఆర్ఎస్ తీసుకున్నవారైతే 55 ఏళ్లు నిండితే చాలు. డిపాజిట్ వేయి రూపాయలు కాగా గరిష్టంగా 15 లక్షల వరకూ పెట్టవచ్చు. డిపాజిట్ మొత్తంపై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఎప్పుడైనా డిపాజిట్ వెనక్కి తీసుకోవచ్చు. ఆదాయపు పున్న చట్టం సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు ఈ పథకానికి వర్తిస్తుంది. ఈ పధకంలో డబ్బులు పొదుపు చేసినవారు గరిష్టంగా 1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. పోస్టాఫీసు, బ్యాంకులలో సేవింగ్స్ పథకం అందుబాటులో ఉంది. 

Also read: Viral Puzzle: ఈ చిత్రంలో ఎన్ని 3 అంకెలు ఉన్నాయో చెప్పగలరా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News