Monkey Playing with King Cobra: డేంజరస్ బ్లాక్ కింగ్ కోబ్రాతో కోతి పరాచకాలు.. చివరకు ఏం జరిగిందంటే..??

Monkey playing with King Cobra: పంట పొలాల మధ్య ఓ బ్లాక్ కింగ్ కోబ్రాతో ఓ చిలిపి కోతి ఆటాడుకుంది. కోబ్రా పడగ విప్పి బుసలు కొట్టినా దాని తోకతో సరదాగా ఆడుకుంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 25, 2023, 01:02 PM IST
  • బ్లాక్ కింగ్ కోబ్రా తోకను లాగిన కోతి
  • చివరికి ఏమైందంటే
  • వీడియో చూస్తే నవ్వడం పక్కా
Monkey Playing with King Cobra: డేంజరస్ బ్లాక్ కింగ్ కోబ్రాతో కోతి పరాచకాలు.. చివరకు ఏం జరిగిందంటే..??

Funny Monkey playing with Dangerous Black King Cobra: ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కువగా నాగు పాము, కింగ్ కోబ్రా, కొండచిలువ, అనకొండ లాంటి పెద్దపెద్ద పాములకు సంబందించిన వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోస్ ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బ్లాక్ కింగ్ కోబ్రాతో ఓ కోతి ఆటాడుకుంది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... పొలాల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఓ బ్లాక్ కింగ్ కోబ్రా ఉంటుంది. అటువైపుగా వెళుతున్న ఓ పెద్ద కోతి దాన్ని చూస్తుంది. కోతిని చూడగానే కింగ్ కోబ్రా ఒక్కసారిగా పడగ విప్పుతుంది. అయినా కూడా బెదరని కోతి.. దాని ముందుకు వెళుతుంది. దాంతో బ్లాక్ కింగ్ కోబ్రా బుసలు కొడుతూ కోతిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. పాము కాటును తప్పించుకున్న కోతి.. దానితో ఆడేందుకు ప్రయత్నిస్తుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nature | Travel | adventure (@beautiful_new_pix)

ఎలాంటి భయం లేని కోతి.. బ్లాక్ కింగ్ కోబ్రా తోకను పట్టుకుని లాగుతుంది. దాంతో కోబ్రా పడగ విప్పి బుసలు కొడుతోంది. అయినా కూడా కోతి తోక పట్టుకుని సరదాగా ఆడుకుంటుంది. ఈ వీడియో చూసిన అందరూ తెగ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'చిలిపి కోతి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఫన్నీ ఫైట్' అని ఇంకొకరు ట్వీట్ చేసారు. ఈ వీడియోను కింద లింక్ క్లిక్ చేసి ఎంజాయ్ చేయండి.

Also Read: Grah Dosh Remedies: ఈ పరిహారాలు ప్రతి గ్రహ దోషాన్ని తొలగిస్తాయి.. ఇక విజయాలు మీవెంటే!   

Also Read: Rahu Transit 2023: మీన రాశిలోకి రాహువు.. ఈ మూడు రాశుల వారు ఉన్నపళంగా ధనవంతులు అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News