King Cobra Viral Video: కోడి గుడ్లను మింగిన కింగ్ కోబ్రా.. డబ్బులు ఇచ్చి మరీ ప్రజల నుంచి రక్షించాడుగా!

Snake Catcher Murliwale Hausla caught King Cobra easily in House. కోడి గుడ్లను మింగిన ఓ కింగ్ కోబ్రాను డేరింగ్ స్నేక్ క్యాచర్‌ మురళీవాలే హౌస్లా ప్రజల నుంచి రక్షించాడు. ఇప్పుడు మనం ఆ వీడియో చూడబోతున్నాం.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 12, 2022, 01:32 PM IST
  • కోడి గుడ్లను మింగిన కింగ్ కోబ్రా
  • డబ్బులు ఇచ్చి మరీ ప్రజల నుంచి రక్షించాడుగా
  • మింగేసిన రెండు గుడ్లను కక్కేస్తుంది
King Cobra Viral Video: కోడి గుడ్లను మింగిన కింగ్ కోబ్రా.. డబ్బులు ఇచ్చి మరీ ప్రజల నుంచి రక్షించాడుగా!

King Cobra Eats Chicken Eggs Viral Video: ప్రస్తుత కాలంలో పాములు అంటే చాలా మందికి చచ్చేంత భయం. పాము పేరు వింటేనే హడలిపోయే చాలామంది అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా కనిపిస్తే ఇంకేమైనా ఉందా?.. ప్రాణ భయాలతో అక్కడి నుంచి పరుగందుకుంటారు. అయితే ఒకడు మాత్రం కింగ్ కోబ్రా లాంటి అత్యంత విషపూరితమైన వాటితో ఆడుకుంటాడు. వాటిని చాలా సులువుగా పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడతాడు. అంతేకాదు ఏదైనా పాము ఆపదలో ఉన్నా.. అనారోగ్యంగా ఉన్నా సపర్యలు చేస్తాడు. అతడే ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ జిల్లాకు చెందిన మురళీవాలే హౌస్లా. 

మురళీవాలే హౌస్లా అనే వ్యక్తి డేరింగ్ స్నేక్ క్యాచర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత డేంజరస్ స్నేక్స్‌ని అయినా చాలా సులువుగా పట్టుకోగలడు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా కేవలం ఓ స్టిక్ సాయంతో పట్టేస్తుంటాడు. మురళీకి సొంత యూట్యూబ్‌ ఛానెల్ కూడా ఉంది. ఆ ఛానెల్లో స్నేక్ క్యాచింగ్ వీడియోలు, విషపూరిత జంతువుల వీడియోలే ఉంటాయి. ఎక్కువగా కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియోస్ ఉంటాయి. కోడి గుడ్లను మింగిన ఓ కింగ్ కోబ్రాను మురళీ ప్రజల నుంచి రక్షించాడు. ఇప్పుడు మనం ఆ వీడియో చూడబోతున్నాం.

ఓ పల్లెటూరులో కోళ్లగూడు ఉంది. ఆ గూడులో గుడ్లతో సహా రెండు పెద్ద కోళ్లు కూడా ఉన్నాయి. అందులోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఆ రెండు కోళ్లను కాటేసి చెంపేస్తుంది. మొత్తం నాలుగు కోడి గుడ్లు ఉండగా.. రెండింటిని మిగేస్తుంది. ఉదయం ఇంటి యజమానులు కోళ్లగూడు తెరవగా.. రెండు కోళ్లు చనిపోయి ఉన్నాయి. కింగ్ కోబ్రా కనిపించడంతో హడిలిపోయిన వారు స్నేక్ క్యాచర్‌ మురళీవాలే హౌస్లాకి సమాచారం అందిటేస్తారు. కోళ్లగూడు తెరవగానే. అది బుసలు కొడుతూ చనిపోయిన కోడిని కాటేస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News