Farmer Buys SUV Car: టమాటాలు అమ్మి SUV కారు కొన్న యువ రైతు

Tomatoes Farmer Buys SUV : ఈసారి టమాట పంట పండించిన రైతులకు ధర భారీగా గిట్టుబాటు కావడంతో హటాత్తుగా లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయారు. తాజాగా రాజేష్ అనే ఓ యువ రైతు కథే ఇందుకు నిదర్శనం.  టమాటా పంట పండించిన రాజేష్.. ఆ పంటను విక్రయించి రూ.40 లక్షలు వరకు సంపాదించాడు.

Written by - Pavan | Last Updated : Aug 8, 2023, 09:06 AM IST
Farmer Buys SUV Car: టమాటాలు అమ్మి SUV కారు కొన్న యువ రైతు

Karnataka Tomatoes Farmer Buys SUV: దేశవ్యాప్తంగా ఆకాశాన్ని అంటుతున్న టమాటా ధరలు సామాన్య మధ్యతరగతి వారికి కంటతడి పెట్టిస్తోంటే.. టమాట రైతులకు మాత్రం ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా కాసుల పంట పండిస్తున్నాయి. ఓవైపు దేశం నలుమూలలా భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ మార్కెట్‌కి టమాట సరఫరా లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు ఏకంగా కిలో రూ.300 పైనే పలుకుతోంది. సరిగ్గా ఇదే పరిణామం టమాట పంట పండించిన రైతులకు వరంగా మారింది.

ఈసారి టమాట పంట పండించిన రైతులకు ధర భారీగా గిట్టుబాటు కావడంతో హటాత్తుగా లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయారు. తాజాగా కర్ణాటకలో రాజేష్ అనే ఓ యువ రైతు కథే ఇందుకు నిదర్శనం.  టమాటా పంట పండించిన రాజేష్.. ఆ పంటను విక్రయించి రూ.40 లక్షలు వరకు సంపాదించాడు. తన 12 ఎకరాల పొలంలో టమాట వేసిన రాజేష్ కి ఉన్నట్టుండి ధరలు పెరగడం బాగా కలిసొచ్చింది. అందుకే తాను పంటను అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక ఎస్‌యూవీ కారు కొన్నానని చెప్పుకొచ్చాడు.

దాదాపు 800 బస్తాల టమోటాలు విక్రయించగా తనకు రూ 40 లక్షలు వరకు ఆదాయం వచ్చింది. ఆ డబ్బుతో ఒక SUV కారు కొన్నాను. ఇంకా కొన్ని నెలలపాటు టమాటా ధరలు ఇలాగే కొనసాగితే తనకు 1 కోటి రూపాయల వరకు లాభం కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. భూమిని నమ్ముకున్నందుకు నాకు లాభమే జరిగింది అని రాజేష్ అభిప్రాయపడ్డాడు.

ఇది కూడా చదవండి : Saffron Cultivation: ఈ పువ్వు ధర కిలో 3 లక్షలపైనే.. ఇంతకీ ఇదేంటో తెలుసా ?

ఇంతకాలం తనకు ఉద్యోగం లేదని, వ్యవసాయం చేసుకుంటున్నానని పెళ్లి సంబంధాలు రాలేదు. ఈమధ్య కాలంలో అమ్మాయిల కుటుంబాలన్నీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికో లేక కార్పొరేట్ జాబ్స్ చేసే వారికో తప్పించి వేరే సంబంధాలు చూడటం లేదు. కానీ ఇప్పుడు నేను అంతకంటే ఎక్కువే సంపాదించాను. సరైన సమయం వస్తే రైతు కూడా భారీగానే సంపాదించగలడు అని తాను ఈ ప్రపంచానికి చెప్పదల్చుకున్నాను అని చెబుతున్న రాజేష్.. ఇప్పుడు ఇదే ఎస్‌యూవీ కారులో వెళ్లి తనకు సూటయ్యే అమ్మాయి ఎక్కడుందో వెదుక్కోవాలి అంటున్నాడు. సామాన్యుల మాట ఎలా ఉన్నా.. ఒక రైతు కళ్లలో ఆనందం కనిపిస్తే ఎలా ఉంటుందా అనే ప్రశ్నకు రాజేశ్ సమాధానంగా నిలవడం గొప్ప విషయం కదా.

ఇది కూడా చదవండి : How To Earn More Money: చిన్న వయస్సులోనే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News