Kala Chashma Dance: క్యా డాన్స్ హై మామ.. ఈ జపాన్ అమ్మాయిల కాలా చష్మా డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే!

Viral Video, Japan school girls dance to kala chashma song. కత్రీనా కైఫ్ నటించిన 'బార్ బార్ దేకో' సినిమాలోని 'కాలా చష్మా' పాటకు జపాన్ అమ్మాయిలు అద్భుతంగా స్టెప్పులు వేశారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 7, 2022, 06:02 PM IST
  • క్యా డాన్స్ హై మామ
  • ఈ జపాన్ అమ్మాయిల డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే
  • గంటలోపే 2.3 మిలియన్ పైగా వ్యూస్
Kala Chashma Dance: క్యా డాన్స్ హై మామ.. ఈ జపాన్ అమ్మాయిల కాలా చష్మా డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే!

Japan school girls dance to katrina kaifs kala chashma song: బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కత్రీనా కైఫ్ జంటగా నటించిన చిత్రం 'బార్ బార్ దేకో'. 2016లో విడుదల అయిన ఈ సినిమాలోని పాట 'కాలా చష్మా' చాలా ఫేమస్ అయింది. ఈ పాటలో కత్రీనా అదిరే స్టెప్పులతో అదరగొట్టారు. కాలా చష్మా సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ఎక్కడ పార్టీ జరిగినా, పెళ్లి జరిగినా కాలా చష్మా పాట మోగుతోంది. కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ సాంగ్ బాగా పాపులర్ అయింది. నిత్యం ఈ పాటపై డాన్సులు చేస్తున్నారు. తాజాగా జపాన్ అమ్మాయిలు అద్భుతంగా స్టెప్పులు వేశారు.

నార్వేకు చెందిన డాన్స్ గ్రూప్ ‘ది క్విక్ స్టైల్’ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జపాన్‌కు చెందిన 10 మందికి పైగా స్కూల్ పిల్లలు కాలా చష్మా పాటకు అదిరే స్టెప్పులు వేశారు. అమ్మాయిలు అందరూ పెప్పీ ట్రాక్‌కు ట్రెండీ మూమెంట్స్ ఇచ్చారు. ఈ వీడియో గంటలోపే 2.3 మిలియన్ పైగా వ్యూస్ సంపాదించింది. ఈ  వీడియో చూసిన అందరూ అమ్మాయిల స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. క్యా డాన్స్ హై మామ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Quick Style (@thequickstyle)

'బార్ బార్ దేకో' సినిమాలోని కాలా చష్మా పాటకు ఉగాండాకు చెందిన ఓ డజను మందికి పైగా పిల్లలు అదిరే స్టెప్పులు వేశారు. ఆ డ్యాన్స్‌కు తెలంగాణ ఐ‌టి శాఖల మంత్రి కేటీఆర్‌ కూడా ఫిదా అయిపోయారు. ఆ మధ్యన ఈ సాంగ్‌ని కొందరు అమెరికన్స్ పెళ్లి ఫంక్షన్‌‌లో ఫెర్మార్స్ చేసి ఒక్క సారిగా హైప్ తీసుకొచ్చారు. మన దేశంలో అయితే రోజుకో వీడియో, రీల్ వస్తున్నాయి. 

Also Read: IND vs SA: ఆఖరి ఓవర్‌లో నా గేమ్‌ ప్లాన్ అదే..సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!  

Also Read: Minister KTR: రాబోయే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్..మా స్కెచ్ అదేనన్న మంత్రి కేటీఆర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News