Viral Video: మిరిండా పానీపురి-ద్యావుడా ఇదేమి కాంబినేషన్-యాక్ అంటున్న నెటిజన్లు

Viral video of Mirinda Panipuri: ఈ ఏడాది ఇంటర్నెట్‌లో ఫాంటా మ్యాగీ, ఓరియో బిస్కెట్ పకోడా పరమ చెత్త ఫుడ్ జాబితాలో చేరిపోయాయి. తాజాగా మరో ఫుడ్ కాంబినేషన్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అదే 'మిరిండా పానీపురి'. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2021, 09:02 PM IST
  • సోషల్ మీడియాలో మిరిండా పానీపురి వీడియో వైరల్
  • ఇదేం కాంబినేషన్ అంటున్న నెటిజన్లు
  • యాక్ అంటూ వెల్లువెత్తుతున్న కామెంట్లు
Viral Video: మిరిండా పానీపురి-ద్యావుడా ఇదేమి కాంబినేషన్-యాక్ అంటున్న నెటిజన్లు

Viral video of Mirinda Panipuri: ఇంటర్నెట్‌లో ఫుడ్ వీడియోలకు (Food videos) ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ లవర్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాల కోసం నెట్టింట సెర్చ్ చేస్తూనే ఉంటారు. అందుకే యూట్యూబ్‌లో నిత్యం బోలెడు ఫుడ్ వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ఇందులో.. చూడగానే నోరూరించే వంటకాలే కాదు... కొన్నిసార్లు యాక్ అనిపించే చెత్త రెసిపీస్ కూడా కనిపిస్తుంటాయి.

ఈ ఏడాది ఇంటర్నెట్‌లో ఫాంటా మ్యాగీ, ఓరియో బిస్కెట్ పకోడా పరమ చెత్త ఫుడ్ జాబితాలో (Food Abomination) చేరిపోయాయి. తాజాగా మరో ఫుడ్ కాంబినేషన్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అదే 'మిరిండా పానీపురి'. జైపూర్‌కి చెందిన ఓ వీధి వ్యాపారి మిరిండా కాంబినేషన్‌తో పానీపురిని సర్వ్ చేస్తున్నాడు. సాధారణంగా పానీపురిలో కాస్త బఠానీ మసాలా పెట్టి.. కొత్తిమీర, పుదీనాతో తయారుచేసిన రసంలో దాన్ని ముంచి ప్లేట్‌లోకి అందించడం చూసుంటాం. దానికి బదులు ఇలా వెరైటీగా మిరిండా డ్రింక్ కాంబినేషన్‌లో పానీపురిని సర్వ్ చేయడంపై చాలామంది నెటిజన్లు 'యాక్' అని కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ యువకుడు మిరిండా కాంబినేషన్ పానీపురి తిని సూపర్బ్‌గా ఉందని చెప్పడం గమనించవచ్చు. అయితే వీడియో (Viral Video) చూసిన నెటిజన్లు మాత్రం 'భగవంతుడా ఇలాంటి రెసిపీ ఐడియాలు ఎలా వస్తాయి వీళ్లకు...' అని కామెంట్ చేస్తున్నారు. కొద్దిరోజులు పోతే టాయిలెట్‌ క్లీన్ చేసే హార్పిక్‌ కాంబినేషన్‌తో కూడా పానీపురి సర్వ్ చేస్తారని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CHATORE_BROOTHERS (@chatore_broothers)

 

Also Read: Scrub Typhus: హైదరాబాద్‌లో స్క్రబ్ టైఫస్ కలకలం-టెన్షన్ పెట్టిస్తోన్న మరో వ్యాధి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News