Husband and Wife Viral News: మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందిగా మహిళకు కోర్టు ఆదేశాలు

Man demands alimony from his former wife: ముంబై: భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు భార్యాబిడ్డల కుటుంబ పోషణ కోసం, వారి ఆర్థిక అవసరాల నిమిత్తం భర్త నుంచి భార్యకు కోర్టులు భరణం ఇప్పించడం సర్వసాధారణంగా జరిగేదే.. అందరం చూసేదే. కానీ ఇప్పుడు మనం చూడబోయేది అందుకు భిన్నమైన కేసు.

Written by - Pavan | Last Updated : Apr 1, 2022, 01:46 AM IST
  • ఈ సీన్ రివర్స్ ఎపిసోడ్‌లో అసలేం జరిగిందంటే..
  • కోర్టు తీర్పును సవాలు చేస్తూ పైకోర్టుకు వెళ్లిన మాజీ భార్య..
  • హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ప్రోసీడ్ అయిన కోర్టు
Husband and Wife Viral News: మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందిగా మహిళకు కోర్టు ఆదేశాలు

Man demands alimony from his former wife: ముంబై: భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు భార్యాబిడ్డల కుటుంబ పోషణ కోసం, వారి ఆర్థిక అవసరాల నిమిత్తం భర్త నుంచి భార్యకు కోర్టులు భరణం ఇప్పించడం సర్వసాధారణంగా జరిగేదే.. అందరం చూసేదే. కానీ ఇప్పుడు మనం చూడబోయేది అందుకు భిన్నమైన కేసు. తన నుంచి విడాకులు తీసుకున్న భార్య నుంచి భరణం కోరుతూ ఓ భర్త కోర్టుకు వెళ్లగా.. పిటిషనర్ వాదనలు విన్న కోర్టు అతడికి భరణం చెల్లించాల్సిందిగా ఆ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును సవాలు చేస్తూ భార్య కోర్టుకు వెళ్లడం.. ఆమె పిటిషన్‌ని కొట్టేస్తూ కింది స్థాయి కోర్టు తీర్పుకు అనుకూలంగా హై కోర్టు బెంచ్ తీర్పు ఇవ్వడం అనేది మనం తాజా ఎపిసోడ్‌లో చూడొచ్చు. ఇంతకీ భరణం విషయంలో సీన్ రివర్స్‌లా కనిపిస్తున్న ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, భార్యే భర్తకు భరణం ఇవ్వాలని కోర్టులు చెప్పేంత భిన్నమైన విషయం ఇందులో ఏం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని నాందేడ్‌కి చెందిన ఓ జంటకు 1992లో వివాహం జరిగింది. 2015లో ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. కోర్టు అదే ఏడాది విడాకులు మంజూరు చేసింది. విడిపోయిన అనంతరం నాందేడ్ సివిల్ కోర్టును ఆశ్రయించిన ఆమె భర్త.. ''తన భార్యను స్కూల్ టీచర్ చేయడం కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఈరోజు ఆమెకు ఉద్యోగ భద్రత, సంపాదన ఉంది కానీ తనకే ఏ ఆదాయం లేనందున ఆమె నుంచి భరణం ఇప్పించాల్సిందిగా'' కోరుతూ కోర్టుకు మొరపెట్టుకున్నాడు. అప్పట్లో పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. అతడికి నెలా నెలా రూ. 3000 భరణం చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది.

కోర్టు తీర్పును సవాలు చేస్తూ పైకోర్టుకు వెళ్లిన మాజీ భార్య..
తన మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందిగా ఆదేశిస్తూ నాందేడ్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ మహిళ బాంబే హై కోర్టు పరిధిలోని ఔరంగబాద్ బెంచ్‌ని ఆశ్రయించారు. తన క్లయింట్‌కు 2015 జనవరిలో విడాకులు మంజూరు కాగా.. ఆ తర్వాత చాలా కాలానికి భరణం చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పు ఇవ్వడం సరైంది కాదని ఆమె తరపు న్యాయవాది ఔరంగబాద్ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే, హిందూ మ్యారేజ్ యాక్టులోని సెక్షన్ 25 ప్రకారం ఎప్పుడైనా భరణం కోసం మాజీ జీవిత భాగస్వామి కోర్టును ఆశ్రయించవచ్చని భర్త తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం..
ఔరంగబాద్ హై కోర్టు బెంచ్‌లో తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ఆమె ఆశించారు. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 చట్టంలోని 25వ సెక్షన్‌తో పాటు సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ఆధారంగా చేసుకుని ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేసిన ఔరంగాబాద్ బెంచ్.. నాందేడ్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించడం గమనార్హం. అంతేకాకుండా.. 2017 నాటి కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఆమె భరణం చెల్లించడం లేదని ఆమె భర్త 2019లో వేసిన ఓ పిటిషన్‌పై అప్పట్లోనే విచారణ చేపట్టిన నాందేడ్ కోర్టు.. 2017లో కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి భరణం చెల్లించనందుకుగాను ప్రతీ నెల ఆమె వేతనంలోంచి రూ. 5000 కోత విధించి ఆ మొత్తాన్ని కోర్టులో జమ చేయాల్సిందిగా అప్పట్లోనే ఆదేశించింది. ఈ తీర్పును సైతం ఆమె ఔరంగబాద్ కోర్టులో సవాలు చేసి భంగపడటం గమనార్హం. మొత్తానికి ఈ న్యాయ పోరాటంలో ఆమెపై మాజీ భర్తే పైచేయి సాధించారన్న మాట.

Also read: Interesting facts about RRR Movie ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ అందుకే

Also read : Hyderabad Metro Offersరూ.59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చు!.

Also read : Traffic challans in Hyderabadవాహనదారులకు మరో గుడ్‌న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News