Funeral Services: అంత్యక్రియలకూ ఓ స్టార్టప్.. షాక్ లో నెటిజన్లు... వైరల్ అవుతున్న ఫోటోలు..

Funeral services start-up: వినూత్న ఆలోచనలే ప్రపంచ గతిని మార్చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో యువత విభిన్న ఆలోచనలు చేస్తూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తోంది. తాజాగా ఓ స్టార్టప్ ఐడియా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 07:25 AM IST
  • మార్కెట్లోకి కొత్త స్టార్టప్
  • ఈ కంపెనీ కర్మకాండలు జరిపిస్తుందట
  • ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
Funeral Services: అంత్యక్రియలకూ ఓ స్టార్టప్.. షాక్ లో నెటిజన్లు... వైరల్ అవుతున్న ఫోటోలు..

Funeral services start-up viral: రోజూ ఎన్నో స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి.  స్పేస్‌ రాకెట్ నుంచి హోమ్‌ డెలివరీ సేవల వరకు ఇవి సేవలందిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా ఎక్కువ స్టార్టప్ కంపెనీలు ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే తాజాగా  ముంబయికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ మోడల్ అందరినీ షాక్ కు గురిచేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కంపెనీ ఎలాంటి సేవలందిస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా?.

ఆత్మీయులను కోల్పోయి.. బాధలో ఉన్నవారికి సాంత్వన చేకూర్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కర్మకాండలు జరిపిస్తుందట ముంబైకి చెందిన ‘'సుఖాంత్‌ ఫ్యునరల్‌ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ'. అంతేకాదండోయ్..అంబులెన్స్‌ సర్వీస్‌, డెత్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు కూడా సాయం చేస్తుందట. ఈ కర్మకాండల సర్వీసు కోసం ఈ కంపెనీ సుమారు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా ఈ స్టార్టప్‌కు సబంధించిన ఫొటోను అవనీష్‌ వైష్ణవ్ అనే ఐఏఎస్‌ అధికారి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి ‘''ఇలాంటి స్టార్టప్‌ అవసరం ఉందా?’''’ అని క్యాప్షన్ ఇచ్చారు. అది కాస్తా నెట్టింట వైరల్ అయింది.  ''ఇలాంటి సేవలు భారత్‌లో కొత్త కావచ్చు. అమెరికాలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, చివరి రోజుల్లో ఇబ్బందిపడే వారికి ఈ స్టార్టప్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని''.. పలువురు నెటిజన్లు కామెంట్లు ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.  

Also Read: King Cobra Nest Viral Video: కింగ్ కోబ్రా గూడు కట్టుకుంటుంది.. నమ్మడం లేదా! ఈ వీడియో చూడండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News