Viral Video: బతికున్న పాముని అమాంతం మింగేసిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే అంతే..!!

Big King Cobra eats alive Snake. కింగ్‌కోబ్రాకు సంబందించిన వీడియోను ఇన్‌స్టాలో స్నేక్ వ‌ర‌ల్డ్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒక పెద్ద కింగ్‌కోబ్రా.. రంధ్రంలోకి దూరి పెద్ద తాచు పాముని పట్టుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 01:51 PM IST
  • కింగ్ కోబ్రా రంధ్రంలోకి దూరి
  • భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ
  • బతికున్న పాముని అమాంతం మింగేసిన కింగ్ కోబ్రా
Viral Video: బతికున్న పాముని అమాంతం మింగేసిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే అంతే..!!

Google Trend Video, Big King Cobra eats alive Snake: ఆవులు, జింకలు, కోతులు, మేకలు ఇంకా ఇతర జంతువులను పెద్ద పెద్ద పాములు అమాంతం మింగటం మనం ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటాం. వారాలు, నెల‌ల త‌ర‌బ‌డి ఆహారం తీసుకోకుండా ఉండడంతో ఇలా ఒకేసారి మింగేస్తుంటాయి. అయితే ఒక పాము మరొక పాముని బతికుండగానే మింగేయడం చాలా అరుదు. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ పామును కింగ్‌కోబ్రా మింగేసింది. 

కింగ్‌కోబ్రాకు సంబందించిన వీడియోను ఇన్‌స్టాలో స్నేక్ వ‌ర‌ల్డ్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒక పెద్ద కింగ్‌కోబ్రా.. రంధ్రంలోకి దూరి పెద్ద తాచు పాముని పట్టుకుంది. ఈ సమయంలో అది గుండ్రంగా తిరుగుతూ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించింది. చివరకు తాచు పాముని కింగ్‌కోబ్రా నోట కరుచుకుని బయటకు వచ్చింది. తాచు పామును కొద్దిగా కొద్దిగా మింగుతూ వచ్చింది. చివరకు తాచు పాము బతికుండగానే దాన్ని గుటుక్కున మింగేసింది. 

ఈ వీడియోని స్నేక్ వరల్డ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేయగా.. దీనికి లక్ష వరకు వ్యూస్, మూడు వేల వరకు లైకులు వచ్చాయి. వీడియో చుసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'ఇలాంటి వీడియో ఎప్పుడు చూడలే', 'వామ్మో ఇదేం పాము రా సామీ', 'ఇలాంటి పాములు కూడా ఉంటాయా?' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world)

ఈ భూ ప్రపంచంలో ఎక్కువగా కింగ్ స్నేక్స్, కింగ్ కోబ్రా, బ్లాక్ హెడ్డెడ్, కొండ చిలువలు, ముసురానా, నీలి మందు పాములు చాలా ప్రమాదకరం. ఇవన్ని ఇతర పాములను తింటాయి. ఆహారం తీసుకోకుండా ఉండడంతో చాలా రోజులు ఉండడంతోనే ఇలా చేస్తుంటాయట. ఇక మిగతా పాములు ఇతర పాములను తినవు.

Also Read: Samantha Ruth Prabhu: సిద్ధంగా ఉండండి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సమంత!!

Also Read: AP High Court News: ఏపీ గవర్నమెంట్ కు బిగ్ షాక్.. 8 మంది ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News