Google Top Searches: నిత్య జీవితంలో గూగుల్ ఓ భాగమైపోయింది. అందుకే గూగుల్ తల్లి అని ముద్దుగా కూడా పిల్చుకుంటాం. మరి ఈ ఏడాది ఏ అంశాలపై ఎక్కువగా సెర్చ్ జరిగిందో తెలుసా..ఆసక్తికరమైన అంశాలున్నాయి ఈ సెర్చ్‌లో..
2020లో గూగుల్‌లో ( Google ) ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై ఎక్కువగా సెర్చ్ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏమున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చాలా ఆసక్తికరమైన అంశాలున్నాయి ఇందులో. ఎక్కువ మంది ఎందుకు అంటే వై, ఇది ఏ రోజు అని ఎక్కువగా సెర్చ్ చేశారని తెలిసింది. మరోవైపు ఈ యేడాది టాప్ సెర్చ్ అంశంగా ( Google top search ) కరోనా వైరస్ ( Corona virus ) పదం నిలిచింది. లాక్డౌన్ ( Lockdown ) సమయంలో ఎక్కువగా వంటల గురించి సెర్చ్ ఎక్కువ చేశారట. ఎంత ఎక్కువగా అంటే టాప్ 10 సెర్చ్‌లో 4 వంటల గురించే ఉన్నాయి. తరువాత రోగ నిరోధక శక్తి ( Immunity power ) గురించి ఎక్కువగా సెర్చ్‌లో ఉంది. స్వీట్స్, కేకులు ఎలా తయారు చేయాలి, పాన్‌కార్డుకు ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి, ఫాస్టాగ్ రీఛార్జ్ ప్రాసెస్ వంటి అంశాలపై ఎక్కువగా సెర్చ్ జరిగింది. ఈ పాస్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా టాప్ సెర్చ్‌లో ఉంది. Also read: Samsung Mobile on Rent: అద్దెకు ఫోన్ కావాలా? శాంసంగ్ ఫోన్స్ రెడీ! మీరు రెడియా?
ఏమిటి, కరోనా వైరస్, నెపోటిజమ్ ( Nepotism ), ప్లాస్మాథెరపీ ( Plasma therapy ), సీఏఏ, హంటా వైరస్, సూర్య గ్రహణం వంటివి టాప్ క్వశ్చన్స్ జాబితాలో ఉన్నాయి. క్రీడల విషయంలో ఐపీఎల్ టాప్ సెర్చింగ్‌లో ఉంది. ఆ తరువాత అంశాలుగా అమెరికా ఎన్నికలు, పీఎం కిసాన్ యోజనా, బీహార్, ఢిల్లీ ఎన్నికలున్నాయి. జో బిడెన్ ( Joe Biden )గురించి కూడా ఎక్కువే శోధించారు జనం.
టాప్ సెర్చ్ అంశాల్లో ఎన్నికల ఫలితాలు, కరోనా వైరస్, కోబ్ బ్రయంట్, కరోనా వైరస్ వార్తలు, కరోనా వైరస్ లక్షణాలున్నాయి. హౌ టు మేక్ విభాగంలో హ్యాండ్ శానిటైజర్లు, ఫ్యాబ్రిక్ ఫేస్‌మాస్క్, కాఫీ, కర్చీఫ్ మాస్క్ వంటివి ఉన్నాయి. ఇక బ్యూటీ సెర్చ్ విభాగంలో జుట్టు ఎలా కత్తిరించాలి, ఎలా ప్లాప్ చేయాలి, రంగు ఎలా వేయాలి, టాప్ వర్చువల్ సెర్చెస్, వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్, వర్చ్యువల్ లెర్నింగ్, డేటింగ్, నిరుద్యోగం, ఉద్యోగాల నియామకం, టిక్‌టాక్ నిషేదం ( TikTok Ban )వంటివి ఉన్నాయి. Also read: Viral Wedding: ఒకే మండపంలో తల్లీ, కూతుళ్ల పెళ్లి!