Goat Cries and hugs owner like human: మనుషులకు, జంతువులకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కుక్క, పిల్లి, గేదె, ఆవు, ఎద్దు, మేకలు లాంటి జంతువులు తమ యజమానులతో ఎంతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. మనుషుల వలే మాట్లాడలేని ఈ జంతువులు అన్ని భావోద్వేగాలను కలిగి ఉంటాయి. తమను పెంచిన యజమానిని అమితంగా ప్రేమిస్తాయి. యజమాని నుంచి విడిపోయినప్పుడు వాటి మనస్సు కూడా బాధిస్తుంది. నిజమైన వ్యక్తుల వలె ఏడుస్తాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది.
గత ఆదివారం (జులై 9) బక్రీద్ పండగ జరిగిన విషయం తెలిసిందే. బక్రీద్ పండగ సందర్భంగా ఓయజమాని తన మేకను అమ్మడానికి మార్కెట్‌కు తీసుకుని వచ్చాడు. మేకను మంచి ధరకు అమ్మి డబ్బులు కూడా తీసుకున్నాడు ఆ యజమాని. ఒప్పందం జరుగుతున్న సమయం నుంచే ఆ మేక ఏడవడం మొదలెట్టింది. ఆపై యజమాని భుజంపై తల పెట్టి గట్టిగా ఏడ్చింది. దాంతో యజమాని సైతం కన్నీరు పెట్టుకున్నాడు. అక్కడున్న వాళ్లందరికీ మేక ఏడుపు వినిపించడంతో అందరూ భావోద్వేగానికి గురయ్యారు.
మేక ఏడుస్తున్న సమయంలో ఒకతను వచ్చి దాని కన్నీళ్లు తుడిచాడు. అయినా కూడా ఆ మేక అచ్చు మనిషిలానే ఏడుస్తూనే ఉంది. కొద్దిసేపటికి దాని యజమాని డబ్బు తీసుకుని బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటన మార్కెట్‌లో ఉన్న వారందరి మనస్సును కదిలించింది. ఈ భావోద్వేగ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మేక ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చుసిన నెటిజన్లు మేక ప్రేమకు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోకి లైకుల కామెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read: Virat Kohli Post: విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ పోస్టు.. నేను కింద పడితే ఏమౌతుంది అంటూ..!
Also Read: Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం..వాగులో కొట్టుకుపోయిన పడవ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.