Lady professor dance on peelings song from pushpa 2 movie video: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా ప్రస్తుతం దేశంలో పెనుసంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ఇది పొలిటికల్ వైల్డ్ ఫైర్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఒక వైపున పుష్ప2 మూవీ రికార్డులను తిరగారాస్తునే, అభిమానుల్ని థియేటర్ లకు రప్పించుకుంటుంది. ఈ సినిమాలోని ప్రతీ సీన్ కు, పాటలకు అభిమానులు ఫిదా అవుతున్నారని చెప్పుకొవచ్చు.
మొత్తంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా వావ్.. పుష్పరాజ్ అంటూ బన్నీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరొవైపు.. ఈ మూవీ వివాదాల పరంగా కూడా బన్నీకి కంటి మీద కునుకు కరువైందని చెప్పుకొవచ్చు. అయితే.. ఈ మూవీలోని పాటలు కూడా ప్రస్తుతం రచ్చ చేస్తున్నాయి.
తాజాగా.. ఈ సినిమాలోని పీలింగ్స్ పాటకు లేడీ ప్రొఫెసర్ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. కేరళలోని కొచ్చిన్ యూనీవర్సీటీలో కల్చరల్ కార్యక్రమాలు నడుస్తున్నాయంట. దీనిలో పుష్ప2 సినిమాలోని పీలీంగ్స్ పాటను పెట్టి అక్కడున్న కాలేజీ అమ్మాయిలు దుమ్మురేగే విధంగా స్టెప్పులు వేస్తున్నారు.
ఇంతలో అక్కడికి వచ్చిన లేడీ ప్రొఫెసర్..ఈ పాటకు తనను తాను కంట్రోల్ చేసుకొలేక పోయారో ఏంటో కానీ.. అదిరి పోయే స్టెప్పుులు వేశారు. విద్యార్థినులతో కలిసి.. తానేం తక్కువనా.. అంటూ మాస్ స్టెప్పులు వేశారు. ఈ పీలింగ్స్ పాటకు లేడీ ప్రొఫెసర్ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం లేడీ ప్రొఫెసర్ డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు.