Australia Second Most Venomous Snake Finds In Daughters Bedroom: మనలో చాలా మంది భయంతో చచ్చిపోతుంటారు. పాము అని పేరు తలవడానికి కూడా ఇష్టపడరు.పొరపాటున ఎక్కడైన పాము కన్పిస్తే ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసం చేయరు. అడవులు, గుబురుగా చెట్లు, నీళ్లు ఎక్కువగా ఉన్నప్రదేశాలు, కొండ ప్రాంతాలలో పాములు ఎక్కువగా కన్పిస్తాయి. అంతే కాకుండా.. కొన్నిసార్లు పొలాలు, మన ఇళ్లలోకి కూడా పాములు వస్తుంటాయి. వర్షాకాలంలో పాములు ఎక్కువగ మానవ ఆవాసాలకు వస్తుంటాయి. అవి ఎలుకల వేటలో మన ఇళ్లలోకి వస్తుంటాయి. ఇంట్లో బీరువాలు, షెల్ఫ్ లు, సజ్జల మీద పాములు ఉంటాయి. అక్కడ మనం వెళ్లినప్పుడు పాములు కాటు వేస్తుంటాయి. అచ్చం ఇలాంటి ఒక ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..
పూర్తి వివరాలు..
ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఒక మహిళ తన కుమార్తెల గదిలో ర్యాక్ లను శుభ్రం చేస్తుంది. బట్టలను వాషింగ్ మెషిన్లో వేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో ఒక్కసారిగా ఆమె షాక్ కు గురయ్యింది. ఆమె బట్టలు తీస్తుండగా.. ఒక్కసారిగా పామును చూసి ఆశ్చర్యపోయింది. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి గదితలుపులు లాక్ వేసుకున్నారు. వెంటనే ఇంట్లో వాళ్లను అలర్ట్ చేసింది. అంతేకాకుండా.. స్నేక్ క్యాచర్ అయిన మార్క్ పెల్లీనికి సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్నాడు. గదిలో ఉన్న ర్యాక్ ను పరిశీలించాడు.
అది ప్రపంచంలోనే రెండో అత్యంత విషపూరిత బ్రౌన్ స్నేక్ సర్పమని స్నేక్ క్యాచర్ చెప్పాడు. అతను గంటల తరబడి కష్టపడి బ్రౌన్ స్నేక్ ను చాకచక్యంగా పట్టుకున్నాడు. ఇది కాటు వేస్తే సెకన్ల వ్యవధిలోనే మనిషి ప్రాణాలు పోతాయంటూ కూడా చెప్పాడు. మెల్లగా బ్రౌన్ స్నేక్ ను బంధించి, అక్కడి నుంచి స్నేక్ క్యాచర్ తీసుకెళ్లాడు. తనకు ఎదురైన ఈ ఘటనను సదరు మహిళ ఎక్స్ వేదికగా పంచుకుంది.
Read More: Snake Venom Rave Party: పాముల విషంతో రేవ్ పార్టీ.. బిగ్ బాస్ OTT 2 విన్నర్ అరెస్టు..
యూనివర్శిటీ ఆఫ్ మెల్బోర్న్ యొక్క ఆస్ట్రేలియన్ వెనమ్ రీసెర్చ్ యూనిట్ డేటా ప్రకారం, తూర్పు గోధుమ పాములు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పాములలో రెండవ అత్యంత విషపూరితమైన విషాన్ని కలిగి ఉంటాయి. దీనిలో శక్తివంతమైన న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఇది బాధితుడి గుండె, ఊపిరితిత్తులు, డయాఫ్రాగమ్‌లోని నరాలను క్రమంగా స్తంభింపజేస్తుంది. చివరికి ఊపిరాడకుండా చేస్తుందని చెప్పారు. "ఈ బ్రౌన్ జాతి సర్పాలు.. ఆస్ట్రేలియా యొక్క తూర్పు భాగంలో సర్వసాధారణం. ముఖ్యంగా వ్యవసాయ భూములు, సబర్బన్ ప్రాంతాలలో ఎక్కువగా కన్పిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook