ఏపీ సర్కార్ తీరునున తప్పుబడుతూ ఓ యువకుడు ఏపీ మంత్రి నారా లోకేష్ కు బహిరంగ లేఖ రాశాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉదయ్ కిరణ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హచ్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని.... గత ఎన్నికల్లో తాము టీడీపీని గెలిపించామని గుర్తుచేశాడు. ఈ లేఖలో పలు సమస్యలను ప్రస్తావిస్తూ .... ప్రభుత్వ విధానాలను నిలదీశాడు. రాష్ట్రాభివృద్ధి అంతా కనికట్టు అని, కాగితాలమీదే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రశ్నలు ఇవే...
* వైజాగ్ కు ఎన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చాయి ?
* త్రిపుర సీఎం జీతమెంత? అప్పుల్లో ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జీతమెంత? అని నిగ్గదీశాడు ?
* కేరళలో అవినీతి 4 శాతం ఉంటే ఏపీలో 27 శాతం ఎందుకుందో చెప్పగలరా ?
* విషం చిమ్మే ఆక్వా కంపెనీని పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామాల మధ్య ఎందుకు పెట్టారు?
* లేగ దూడల గిట్టల చప్పుడు వినాల్సిన గోదావరి జిల్లాల ప్రజలు తెల్లారి లేవగానే కరకు పోలీసు బూట్ల చప్పుడు ఎందుకు వింటున్నారని ఆయన ప్రశ్నించాడు
నారాలోకేష్ కు రాసిన తన బహిరంగ లేఖకి సమాధానం ఇస్తారని భావిస్తున్నానని ఆయన ఆకాంక్షించాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖను చదవండి యథతథంగా...
@naralokesh @ncbn మీ నుండి సమాధానం ఆశిస్తూ సామన్యుని బహిరంగ లేఖ pic.twitter.com/2dLOF9vnZd
— Balaudayakiran (@bavuki9) October 24, 2017
లోకేష్‌ను నిలదీసిన సామాన్యుడు