Tremendous Memory Child: ఆ బుడతడు చూపుకు చిన్నోడే, కానీ ఎంతో జ్ఞాపకశక్తి ఉంది. దానికి తోడు గట్టి ధృడ సంకల్పం, ఇలా అన్ని కలయికలతో ఆ రెండేళ్ల అబ్బాయి ఎన్నో రికార్డులు కొల్ల కొట్టాడు. అయితే ఈ రెండేళ్ల అబ్బాయి చెన్నైలోని విరుదునగర్ జిల్లా శివకాశికి చెందిన రామకృష్ణన్-సత్య దంపతుల రెండవ కుమారుడు. ఈ బుడతడు ఏడాది వయస్సులోనే తన ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న విషయాలు గమనించ సాగాడు.
అయితే ఆ చిన్నారికి ఓ ప్రత్యేక ఉంది. మళ్లీ కొద్దికాలం తర్వాత ఇంట్లో పనులను తెలియజేసేలా జ్ఞాపకశక్తి కలిగి ఉన్నాడని తల్లిదండ్రులు గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రులు అప్పటి నుంచే నేతలు, వివిధ దేశాల చిహ్నాలు, మ్యాప్‌లు, జంతువులు, పక్షులు, జాతీయ పతకాలు, తదితరాల గురించి తల్లిదండ్రులు అతనికి నిత్యం తెలియజేసేవారు.
అలా అన్ని విషయాలను తల్లిదండ్రులు తెలిపేవాడు. అయితే అతనికి ఉన్న జ్ఞాపకశక్తితో ఏ క్షణంలోనైనా ఏ వస్తువు, చిత్రం చూపించినా ఆద్విక్‌కుమార్ టక్కున సమాధానం చెప్పేవాడు. చిన్నారికి ఉన్న ప్రత్యేక ప్రతిభతో ఒకట్నిర నుంచి ఆరు నెలల కాలంలో చిన్నారి సుమారు 20 నుంచి 25 రికార్డులు సృష్టించాడు.
ఫిబ్రవరిలో నిర్వహించిన కార్యక్రమంలో 3 నిముషాల 32 సెకన్లలో 100 రకాల చిత్రాలు,30 రకాల ఆహార పదార్ధాల, ఆరుగురు జాతీయ నాయకులు, ఐదుగురు రాజకీయనేతలు, 25 వాహనాల లోగోలు, 10 మంచి అలవాట్లు, 28 రకాల జంతువులు, ఐదుగురు స్వాతంత్య్ర సమరయోధులు, 15 రకాల పక్షులు పేర్లు చెప్పి జాకీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు బుడతడు ఆద్విక్‌కుమార్. చిన్నారికి ఉన్న ప్రత్యేక ప్రతిభను పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇలా రికార్డ్ కొట్టడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: TS EAMCET and ECET schedule: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ఖరారు... పరీక్షల తేదీలివే..
Also Read: Priest Murder: పశ్చిమ గోదావరిలో దారుణం... శివాలయంలో పూజారి దారుణ హత్య...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook