Sana Khan: సనా ఖాన్ భర్తను చూస్తే..ఆశ్చర్యపోతారు

Sana khan marriage photos: బాలీవుడ్ నుంచి పూర్తి ఇస్లాం మార్గాన్ని ఎంచుకున్న సనా ఖాన్ అభిమానుల కోసం అప్పుడప్పుటూ ఫోటోలు షేర్ చేస్తోంది. అందాల తార సనాఖాన్..ఇటీవలే సూరత్ కు చెందిన మౌలానా ముఫ్తీ అన్స్ ను వివాహమాడింది.

  • Nov 28, 2020, 17:54 PM IST

Sana khan marriage photos: బాలీవుడ్ నుంచి పూర్తి ఇస్లాం మార్గాన్ని ఎంచుకున్న సనా ఖాన్ అభిమానుల కోసం అప్పుడప్పుటూ ఫోటోలు షేర్ చేస్తోంది. అందాల తార సనాఖాన్..ఇటీవలే సూరత్ కు చెందిన మౌలానా ముఫ్తీ అన్స్ ను వివాహమాడింది. ఆ పెళ్లి వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా తన భర్తతో కలిసిన కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది సనాఖాన్.

1 /7

వాస్తవానికి లూయిస్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నానని..కానీ లూయస్ చేష్టల గురించి తెలిసి..బ్రేకప్ చెప్పిందని సనా స్పష్టం చేసింది. ఓ వెబ్ సిరీస్ ప్రొమోషన్ సమయంలో సనాఖాన్..బ్రేకప్ కారణంగా ఏడూస్తూ కన్పించేది.

2 /7

లూయిస్ ఓ చిన్నారిని గర్భవతిని చేశాడని తెలుసుకుని బాథపడ్డానని సనా వ్యాఖ్యానించింది. అతడు తన స్టూడెంట్ ను ఫ్లర్ట్ చేస్తుండేవాడని..అతడెలాంటి టీచర్ అనేది దీంతో అర్ధమౌతుందని సనా ఖాన్ తెలిపింది. బ్రేకప్ కారణంగా తాను డిప్రెషన్ లో వెళ్లానని..నిద్రమాత్రలు కూడా తీసుకునేదాన్నని సనా ఖాన్ చెప్పడం అప్పట్లో సంచలనమైంది.

3 /7

ఆ తరువాత సనా ఖాన్ లూయిస్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపింది. అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి సమాధానంగా లూయిస్ సైతం తీవ్ర విమర్శలు చేశాడు.

4 /7

బాలీవుడ్ లో ఉన్నప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో ఉన్న సంబంధం బయటి ప్రపంచానికి తెలియనిదేమీ కాదు. ఈ ఇద్దరి బంధం వార్తల్లో నిలిచింది. వాస్తవానికి సనా ఖాన్ , మెల్విన్ లూయిస్ ఒకానొక సమయంలో కలిసున్నారు. కానీ ఒకేసారి ఇరువురి మధ్య ఏం జరిగిందో గానీ..బ్రేకప్ అయిపోయింది.

5 /7

సనాఖాన్ బాలీవుడ్ లో తన కెరీర్ ను 2005లో యహీ హై హై సొసైటీ సినిమాతో ప్రారంభించింది. ఆ తరువాత హల్లా బోల్, వజహ్ తుమ్ హో, టాయ్ లెట్, ఎక్ ప్రేమ్ కథ వంటి సినిమాల్లో నటించింది.

6 /7

ఇంతకుముందు కూడా తన భర్త అన్స్ ఖాన్ తో కలిసి ఫోటోల్ని షేర్ చేస్తూ..అల్లాహ్ కోసం ఒకరికొకరు ప్రేమించుకున్నామని..అల్లాహ్ కోసం పెళ్లి చేసుకున్నామని..ఈ లోకంలో అల్లాహ్ తమను కలిపి ఉంచాలని..స్వర్గంలో మళ్లీ కలపాలని రాసింది. ఖురాన్ ఆయత్ కూడా ఒకటి రాసింది. దీనర్ధం..నీ సృష్టికర్త ఇచ్చిన ఏయే అద్భుత అవకాశాల్ని తిరస్కరిస్తావు...

7 /7

ఇటీవల సనాఖాన్ మెహందీ ఫోటోల్ని , వీడియోను షేర్ చేసింది. ఇందులో తన రెండు చేతుల్లో అందమైన గోరింటాకుతో..సిగ్గుపడుతున్న వీడియో ఉంది. అభిమానులు బాగా ఫిదా అవుతున్నారు. మెహందీ వీడియోలో తాను చాలా ప్రత్యేకంగా కన్పిస్తున్నానని కూడా రాసుకుంది.