Yamaha Aerox 155 Price: యమహా మోటార్ అంటేనే స్పోర్ట్స్ బైక్‌లకి పెట్టింది పేరు.. అద్భుతమైన లుకింగ్‌తో ప్రీమియం ఫీచర్స్‌తో ఈ స్కూటర్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. ప్రముఖ జపనీస్ మోటార్ సైకిల్ కంపెనీ యమహా ఈ ఏడాది ఏప్రిల్‌లో అద్భుతమైన స్పోర్ట్స్ స్కూటర్‌ను విడుదల చేసింది. అయితే ఇది విడుదలై 9 నెలలు అయినప్పటికీ చాలా మందికి దీని గురించి తెలియదు. ఇంతకీ ఇది ఏ స్కూటరో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
యమహా ఇదే సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఏరోక్స్ 155 (Yamaha Aerox 155) పేరుతో అద్భుతమైన స్పోర్ట్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో.. అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఈ Yamaha Aerox 155 స్కూటర్ వివరాల్లోకి వెళితే.. స్పోర్టీ బాడీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఏరోడైనమిక్ లైన్‌లో విడుదలైనట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ స్కూటర్ అద్భుతమైన సౌండ్‌తో విడుదలైంది. అలాగే ఈ స్కూటర్ స్మార్ట్ కీ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
యమహా ఏరోక్స్ 155 స్పోర్టీ స్టూటర్ డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ లైట్స్ కూడా ప్రత్యేకమైన డిజైన్‌తో వచ్చాయి. అలాగే ఇది 1980 mm పొడవుతో పాటు 700 mm వెడల్పుతో వస్తోంది.
ఈ స్పోర్ట్స్ స్కూటర్‌లో 155 సిసి పవర్ ఫుల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఇంజన్ 13.9 Nm గరిష్టంగా టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది 15 PS పవర్‌తో దూసుకుపోనుంది. ఇది లీటర్‌కి 48.62 కి.మీ పాటు మైలేజీని అందిచనుంది.
ఇక Yamaha Aerox 155 స్కూటర్ ధర వివరాల్లోకి వెళితే.. ఈ స్కూటర్ బేస్ వేరియంట్ ధర రూ.1.48 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ వివిధ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.