Yamadeepdaan 2024: నరక చతుర్దశి రోజు యమ దీపం వెలిగిస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి..

Yamadeepdaan 2024: హిందూ సంప్రదాయం ప్రకారం, చాలా మంది దీపావళి పండగను రెండు నుంచి మూడు రోజుల పాటు జరుపుకుంటారు. కొంతమందైతే దీపావళికి ముందు రోజు నరక చతుర్దశిని జరుపుకుంటారు. నార్త్‌ ఇండియన్స్‌ ఈ చతుర్దశిని ఛోటీ దీపావళిగా కూడా పిలుస్తారు. దీనిని చెడుపై సాధించిన మంచి విజయానికి గానూ ఈ నరక చతుర్దశిని జరుపుకుంటారు. అయితే ఈ రోజున ప్రదోష సమయంలో యముడిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా చాలా మంది ఈ రోజు నాలుగు ముఖాల దీపాలను వెలిగించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
 

1 /7

కొన్ని ప్రాంతాల్లో హిందువులు ఈ నరక చతుర్దశి రోజున ధన్వంతరి, లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజిస్తారు. అయితే యమ దేవుడికి మాత్రం ఈ రోజు సాయంత్రం పూట యమ దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపాన్ని వెలిగించి.. యమ ధర్మరాజును కోరికలు కోరుకుంటారు.   

2 /7

ఛోటీ దీపావళి మీరు కూడా ఈ యమ దీపాన్ని వెలిగించాలనుకుంటున్నారా? ఇలా చేయండి.. యమ దీపాన్ని పెట్టేవారు ఈ దీపాన్ని తప్పకుండి గోధుమ లేదా బియ్యం పిండితో దీపాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది.   

3 /7

గోధుమ పిండితో దీపాన్ని తయారు చేసుకుని నాలుగు వైపులా ఒత్తులు పెట్టుకుని దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అయితే ఈ దీపాన్ని వెలిగించాలుకునేవారు కేవలం నువ్వుల నూనెతో మాత్రమే దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది.  

4 /7

కొంతమంది ఈ దీపాన్ని ఆవు నెయ్యితో కూడా వెలిగిస్తారు. అయితే ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత దాని చుట్టూ గంగాజలం చల్లి.. ఇంటికి ప్రధాన ద్వారం నుంచి ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రధాన ద్వారం దగ్గర దక్షిణ దిశలో ఉంచాల్సి ఉంటుంది.  

5 /7

దీపాపం వెలిగించే ముందు తప్పకుండా దాని కింద ధాన్యం వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టిన దీపం ముందు యముడిని విశ్వాసంతో, భావోద్వేగంతో పూజించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్రేయస్సు, ఆనందం లభిస్తుంది.  

6 /7

ఈ సంవత్సరం నరక చతుర్దశి అక్టోబర్‌ 30వ తేదిన వచ్చింది. ఇది మధ్యాహ్నం 1:15 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత  చతుర్దశి తిథి గురువారం అక్టోబర్ 31వ తేదిన ముగుస్తుంది. ఈ రోజు యమ దీపాన్ని వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.  

7 /7

అలాగే ఈ యమ దీపం వెలగించడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.