Xiaomi 14 Series Price: Apple 15ను మించిన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Xiaomi 14 సిరీస్‌..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

Xiaomi Ultra 14 - Xiaomi 14 Pro Price: 1Tb ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి త్వరలోనే Xiaomi 14 సిరీస్‌ మొబైల్స్‌ లాంచ్‌ కాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 /9

త్వరలోనే ప్రపంచ మార్కెట్‌లోకి ప్రముఖ టెక్‌ కంపెనీ షియోమీ మరో మూడు ప్రీమియం సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేయబోతోంది. ఫిబ్రవరి 25న జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ఇవెంట్‌లో భాగంగా ఈ Xiaomi 14, 14 Ultra, 14 Pro స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే లాంచింగ్‌కి ముందే ఈ మొబైల్‌కి సంబంధించి ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

2 /9

షియోమీ మార్కెట్‌కి అల్ట్రా వేరియంట్‌ను లాంచ్‌ చేస్తే..ఇది ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

3 /9

షియోమీ కంపెనీ ఈ Xiaomi 14, 14 Ultra, 14 Pro మూడు వేరియంట్స్‌ను ప్రీమియం ఫీచర్స్‌తోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ మొబైల్స్‌  12GB ర్యామ్‌, 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో ఆప్షన్‌తో విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది.

4 /9

షియోమీ ఈ మూడు మొబైల్స్‌ను HyperOS యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వినియోగదారులకు అందించేందుకు యోచిస్తోంది. 

5 /9

ఈ Xiaomi 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ గతంలో చైనాలో విడుదల చేసిన Xiaomi 13 సిరీస్‌ను పోలి ఉంటాయని పలువురు టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు.  

6 /9

మార్కెట్‌లోకి ఈ మొబైల్స్‌ విడుదలైతే ప్రారంభ ధర రూ.56,800 ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో విడుదల చేసిన 13 Ultra స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 1.3 లక్షలుగా ఉంది.

7 /9

షియోమీ 14 సిరీస్‌లు గరిష్టంగా 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌తో 12GB ర్యామ్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతున్నాయి.

8 /9

ఇక ఈ మొబైల్స్‌కి సంబంధించిన బ్యాటరీలో వివరాల్లోకి వెళితే..కంపెనీ ఇందులో 4,610 mAh బ్యాటరీ, 90W వైర్డ్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ మద్ధతుతో అందించబోతోంది. 

9 /9

అలాగే ఈ సిరీస్‌లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 6.36 అంగుళాల LTPO AMOLED డిస్ల్పేను అందిచబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది.