Ships Stucked in Frozen Sea: చలి ప్రభావం తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రమార్గంలో జరిగే రవాణాపై ఆ ప్రభావం కన్పిస్తోంది రవాణా ఆగితే కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితి. రష్యా సమీపంలో సముద్రంలో దాదాపు 18 గూడ్స్ షిప్స్ మంచులో ఇరుక్కుపోయిన దృశ్యాలు ఇవి..
సముద్రమార్గంలో సాధారణంగా తప్పు చేయడానికి ఆస్కారముండదు. ఇలా అసాధారణంగా నీరు గడ్డకట్టడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. తక్షణం సాధారణ పరిస్థితుల్ని నెలకొల్పకపోతే నెలరోజుల వరకూ ఇలాగే ఉండిపోవల్సి వస్తుంది.
వాస్తవానికి సముద్రం గడ్డకట్టడమనేది సాధారణ విషయమే. ఈసారి మాత్రం కాస్త ముందుగా జరిగింది.
కొన్ని ఓడలైతే చాలా రోజుల్నించి ఇరుక్కుపోయాయని తెలుస్తోంది. దాంతో ఆహార పదార్ధాలు, మందుల్ని సరఫరా చేశారు. సముద్రంలో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు రెండు ప్రత్యేకమైన ఐస్ బ్రేకర్స్‌ను పంపించింది రష్యా. దాంతోపాటు రెండు ఆయిర్ ట్యాంకర్లు, కార్గో బోట్స్లను పంపింది.
మాస్కో టైమ్స్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, చాలావరకూ ఓడలు లాప్టేవ్ సముద్రం, తూర్పు సైబీరియా సముద్రంలో 30 సెంటీమీర్ల మేర ఏర్పడిన మంచు కారణంగా ఇరుక్కుపోయాయి.
రష్యా తీరప్రాంతం సమీపంలో ఆర్కిటిక్ సముద్రం నిర్ణీత కాలం కంటే ముందే గడ్డ కట్టుకుపోతోంది. ఫలితంగా దాదాపు 18 గూడ్స్ ఓడలు ఇరుక్కుపోయాయి.