Taliban militants enjoyed a day off: భుజాలపై రైఫిళ్లను ఉంచుకుని పార్కుల్లోని కాబూల్ నగరంలో పలు ప్రాంతాల్లో తాలిబన్లు హాయిగా తిరిగేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
When hardened Taliban militants enjoyed a day off at Kabul's amusement park : కాబూల్ నగరంలో తాలిబన్లు అమ్యూజ్ మెంట్ పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక రోజు సెలవు దొరకడంతో వారంతా హాయిగా అలా చక్కర్లు కొట్టేస్తున్నారు. భుజాలపై రైఫిళ్లను అలాగే ఉంచుకుని పార్కుల్లోని పలు ప్రాంతాల్లో హాయిగా తిరిగేస్తున్నారు. తాలిబన్లు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుర్రాలపై ‘స్వారీ’ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. తాలిబన్లు.
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకుని నెల రోజులకు పైగా గడిచిపోయింది. సమస్యాత్మక దేశంలో 1990 నాటి తరహాలోనే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. అయితే కాబూల్ నగరంలో కొందరు తాలిబన్లు పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక రోజు సెలవు దొరకడంతో వారంతా హాయిగా గడుపుతున్నారు. (Pic credit: Reuters)
ఇక క్రూర విధానాలను అనుసరించమని తాలిబన్లు చెబుతున్నా తాజాగా వారు అవలంభిస్తున్న విధానాల్లో కొంచెం కూడా వ్యత్యాసం కనిపించడం లేదు. అప్పుడప్పుడు తాలిబన్లు ఇలా పార్కుల్లో విహరించడం మినాహాయిస్తే మిలిగిన పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. (Pic credit: Reuters)
గత ఆగస్టు నెలలో కాబుల్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లో మానవ హక్కులకు భంగం వాటిల్లేలా తాలిబన్లు కఠినమైన శిక్షలను అమలు చేశారు. దీంతో అక్కడి పౌరులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కానీ కాబూల్‌లో పార్కుల్లో సెలవుదినాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడుపుతోన్న సీన్స్ కూడా అప్పుడప్పుడు కనపడుతున్నాయి.(Pic credit: Reuters)
చేతుల్లో మారణాయుధాలతోనే అమ్యూజ్మెంట్ పార్క్‌లో తిరుగుతున్నారు తాలిబన్లు. (Pic credit: Reuters)
కొందరు తాలిబన్లు జెయింట్ వీల్లో ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. గట్టిగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. (Pic credit: Reuters)
అమ్యూజ్మెంట్ పార్కులో ప్లే హార్సెస్ ఎక్కి చిందులు వేయడమే కాకుండా నిజమైన గుర్రాలు కూడా తుపాకులు పట్టుకుని ఫోజులు ఇస్తున్నారు తాలిబన్లు. (Pic credit: Reuters)