Cassowary Bird: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకమైన క్యాసోవరీ పక్షి గురించి తెలుసా మీకు. డైనోసార్తో పోలుస్తారు ఈ పక్షిని. వేలాది సంవత్సరాల క్రితం ఈ పక్షిని ప్రజలు పెంచుకునేవారు. ఈ పక్షికారణంగా కొంతమంది ప్రాణాలు పోవడంతో ఈ పక్షి మరోసారి చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే..
2019లో ఫ్లోరిడాలో ఓ విదేశీయుడైన యజమానిని ఈ పక్షి చంపేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షిగా ఈ ఘటనతోనే తెలిసింది. మనిషిని చంపేంత బలంగా ఉంటాయివి.
క్యాసోవరీ పక్షి కాలి బొటనవేలు లావుగా, వాడిగా, బలంగా ఉంటుంది. ఈ పక్షి ఎప్పటికప్పుడు తన స్థావరాన్ని మార్చుకుంటూ ఉంటుంది.
ఈ పక్షి చూడ్డానికి కూడా చాలా పెద్దది, భయంకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూగినీ నుంచి తెలిసిన సమాచారం ప్రకారం క్యాసోవరీ పక్షి నుంచి గుడ్లు సేకరించడం చాలా కష్టం.
క్యాసోవరీ పక్షిని పెంచడాన్ని మనిషి 18 వేల ఏళ్లక్రితమే నేర్చుకున్నాడని..అమెరికాకు చెందిన యేన్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్టినా డగ్లస్ నివేదించింది.
న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం మనిషి..రామచిలుక, కోళ్లు, పావురాలకు ముందే క్యాసోవరీ వంటి ప్రమాదకరమైన పక్షిని పెంచడం అలవాటు చేసుకున్నాడు.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్యాసోవరీ పక్షి కధ ఇది. ఈ పక్షి కాలి బొటనవేలు అత్యంత వాడిగా ప్రమాదకరంగా ఉంటుంది. క్యాసోవరీ పక్షిని 18 వేల ఏళ్లక్రితమే పెంచడం మనిషి నేర్చుకున్నాడు.