Sugar Effect: చక్కెరను ఓ నెల రోజుల పాటు మానేసి ఉండగలరా..అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా. మీకున్న సమస్యలు పెరుగుతాయా..తగ్గుతాయా.. అసలు అధ్యయనాలు ఏం చెబుతున్నాయో పరిశీలిద్దాం..
Sugar Effect: చక్కెరను ఓ నెల రోజుల పాటు మానేసి ఉండగలరా..అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా. మీకున్న సమస్యలు పెరుగుతాయా..తగ్గుతాయా.. అసలు అధ్యయనాలు ఏం చెబుతున్నాయో పరిశీలిద్దాం..
స్వీట్స్ అంటే చాలామందికి మక్కువ ఎక్కువే. కానీ పరిమితికి మించి తింటే దుష్పరిణామాలకు దారి తీస్తుంది. శరీరంలో చక్కెర పరిమాణం ఎక్కువైతే..డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి. ఓ నెల రోజుల పాటు చక్కెర తినడం మానేసి చూడండి..ఏం జరుగుతుందో తెలుసా..శరీరంలో పలు రకాల మార్పులు చోటుచేసుకుంటాయి.
చక్కెర తినడం మానేస్తే..అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
దంత క్షయం వచ్చేందుకు కారణం కూడా చక్కెర ఎక్కువగా తినడమే. అందుకే చక్కెర తినడాన్ని పూర్తిగా మానేస్తే దంత సమస్యలు దరి చేరవు.
చక్కెర తినడం మానేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని.. సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.
ఎక్కువ బరువు లేని వారు చక్కెర తినడం మానేస్తే శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయి. ఫలితంగా శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత శక్తి, సమయం లభిస్తాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. శరీరం చురుగ్గా ఉంటుంది.
చక్కెరను తినడం పూర్తిగా మానేస్తే బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. తీపి పదార్థాలను తినాలనే ఆలోనచ ఉండదు.