Tulsi Plant Remedies: మీ ఇంట్లో తులసి మొక్క వాడిపోయిందా.. ? సమస్యలు రాకముందే ఇలా చేయండి

Dry Tulasi Plant: ఇంట్లో పూలకుండిలో తులసి మొక్కను నాటి ఆ తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావించి పూజించే అలవాటు చాలా మందికి ఉంటుంది. నిత్యం పొద్దున్నే వేకువ జామునే నిద్రలేవడంతోనే పవిత్ర స్నానం ఆచరించి, పవిత్ర హృదయంతో తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, సకల సౌఖ్యాలు కలగడంతో పాటు మాంగల్య బలం పెరుగుతుంది అనేది తులసి మొక్కను పూజించే భక్తుల విశ్వాసం.

  • Mar 18, 2023, 20:53 PM IST

Dry Tulsi Plant: తులసి మొక్కను దైవంగా భావించి పూజిస్తాం కనుకే ఆ తులసి మొక్కకు రోజూ నీరు పోసి కాపాడుకుంటుంటారు. అయితే ఒకవేళ తులసి మొక్క ఎండిపోతే ఏం జరుగుతుంది అనే భయం కూడా చాలామందిని వెంటాడుతుంది. 

1 /9

తులసి మొక్క వాడిపోతే ఏమైనా కీడు జరుగుతుందా ? తులసి మొక్క వాడిపోతే ఏమైనా హానీ జరుగుతుందా అనే భయం చాలామందిని వేధిస్తుంటుంది.

2 /9

ఇంట్లో తులసి మొక్క వాడిపోతే ఇంట్లో సమస్యలు, ఆర్ధిక సమస్యులు కలుగుతుంటాయి. 

3 /9

తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని ఎలాగైతే ఆశిస్తామో.. అలాగే తులసి మొక్క వాడిపోతే లక్ష్మీ దేవి ఆగ్రహం చెంది ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయనే భావన కూడా చాలా మందిలో ఉంటుంది. 

4 /9

తులసి మొక్క ఎండిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాతావరణం అనుకూలించకపోవడం కూడా అందులో ఒకటై ఉండొచ్చు.

5 /9

తులసి మొక్క వాడిపోవడానికి వెనుకున్న కారణాలు ఏవైనా కావొచ్చు కానీ.. తులసి మొక్క ఎండిపోతే అలా వదిలేయకండి. 

6 /9

వాడిపోయిన తులసి మొక్క స్థానంలో మరొక కొత్త తులసి మొక్కను తీసుకొచ్చి నాటండి. కొత్త తులసి మొక్కను నాటేందుకు గురువారం అనువైన రోజుగా భావించాల్సి ఉంటుంది. 

7 /9

తులసి మొక్కను నాటడంతోనే ఆ మట్టి కూడా పవిత్రమైపోతుంది. అందుకే కొత్త తులసి మొక్కను నాటే వరకు ఆ మట్టిని నింపిన కుండిని కూడా పూజించవచ్చని పండితులు చెబుతున్నారు. 

8 /9

ఇంట్లో రామ తులసి మొక్కను నాటి పూజిస్తే అత్యంత శుభం కలుగుతుందని భక్తుల్లో బలమైన విశ్వాసం ఉంది.

9 /9

వాడిపోయిన తులసి మొక్కను అందులోంచి తొలగించాలనుకున్నా.. స్నానం చేసిన తరువాతే ఆ కుండిని స్పర్శించాలి. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను టచ్ చేయకూడదు. ( గమనిక: ఈ కథనంలో ప్రస్తావించిన సమాచారం సమాజంలోని విశ్వాసాల ఆధారంగా రాసినవి. ఈ అభిప్రాయాలు, సూచనలతో జీ న్యూస్ ఏ విధంగానూ ఏకీభవించడం లేదు )